సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. వివిధ పార్టీలన్నీ కొత్త నేతల చేరికలతో బిజీగా మారాయి.. ప్రస్తుతం ఎవరికి నచ్చిన పార్టీలోకి వారు వెళ్ళడం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒడిశా (Odisha)లో అధికార బీజేడీ (BJD) ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్ (Bhartrihari Mahatab) పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు పంపించారు.

తాజాగా పార్టీని వీడిన కటక్ ఎంపీ.. బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.. ఇదిలా ఉండగా బీజేడీతో ఒడిశాలో బీజేపీ పొత్తు కుదరలేదు. ఈ క్రమంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ తేల్చి చెప్పారు. 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని ప్రకటించారు.
బీజేపీని మోడీ సంక్షేమ పథకాలే గెలిపించబోతున్నాయని వెల్లడించారు.. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయిస్తున్నా.. నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని మన్మోహన్ సమాల్ ఆరోపిం