Telugu News » Telangana : కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన కేసీఆర్.. కేంద్రం చర్యలు ఖండిస్తున్నట్లు వెల్లడి..!

Telangana : కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన కేసీఆర్.. కేంద్రం చర్యలు ఖండిస్తున్నట్లు వెల్లడి..!

ఈ పాపంలో పావులుగా ఈడీ, సీబీఐ, ఐటీ త‌దిత‌ర కేంద్ర ద‌ర్యాప్తు సంస్థల‌ను కేంద్ర ప్రభుత్వం వాడుకొంటున్నదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా ప‌రిణ‌మిస్తున్న బీజేపీ ప్రభుత్వ చ‌ర్యల‌ను భారత రాష్ట్ర స‌మితి తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు..

by Venu
another-sensation-in-the-delhi-liquor-scam-case-kavitha-kejriwal-robbed-thousands-of-crores-by-sukesh-chandrasekhar

ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ( CM Kejriwal) అరెస్ట్‌ను ఇప్పటికే పలువురు నేతలు ఖండిస్తున్నారు.. కాగా తాజాగా బీఆర్ఎస్ (BRS) అధినేత, తెలంగాణ (Telangana) మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఈ ఘటనపై స్పందించారు. ఈ సందర్భంగా నేడు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజుగా అభివర్ణించారు.

cm kcr submitted resignation letter to governorఅదేవిధంగా కేంద్రంలోని బీజేపీ (BJP), ప్రతిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో వ్యవ‌హ‌రిస్తున్నదని మండిపడ్డారు. వీటికి నిదర్శనంగా ఇటీవ‌ల జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘ‌ట‌న‌లు రుజువు చేస్తున్నాయని తెలిపారు. అధికారమే పరమావధిగా బీజేపీ వ్యవహరిస్తుందని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయని కేసీఆర్ విమర్శించారు..

ఈ పాపంలో పావులుగా ఈడీ, సీబీఐ, ఐటీ త‌దిత‌ర కేంద్ర ద‌ర్యాప్తు సంస్థల‌ను కేంద్ర ప్రభుత్వం వాడుకొంటున్నదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా ప‌రిణ‌మిస్తున్న బీజేపీ ప్రభుత్వ చ‌ర్యల‌ను భారత రాష్ట్ర స‌మితి తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు.. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అని పేర్కొన్న కేసీఆర్.. ఈ అక్రమ కేసుల‌ను వెన‌క్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంట‌నే విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు..

You may also like

Leave a Comment