Telugu News » Osmania University : ఓయూలో స్వేచ్ఛా వాయువులు.. పదేళ్ల కంచెల తొలగింపు..!!

Osmania University : ఓయూలో స్వేచ్ఛా వాయువులు.. పదేళ్ల కంచెల తొలగింపు..!!

బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం సాధించి.. 2014లో అధికారంలోకి వచ్చాక.. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, ఆందోళనలు నిషేధించింది. ఓయూ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు ఉన్న గేటుకు ముళ్లకంచెలు వేశారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలపై నిరంకుశంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎన్నో సార్లు ఓయూ విద్యార్థులు మండిపడ్దారు..

by Venu

తెలంగాణ (Telangana) ఉద్యమానికి ఆరు దశాబ్దాలు ఆయువుగా నిలిచిన ఉస్మానియా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. సమస్యలతో సతమతం అవుతూ భారంగా గడుపుతోందని ఓయూ (OU)లో ఎన్నోసార్లు నిరసన కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే.. అదీగాక గత పదేళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చుట్టూ ఉన్న ముళ్ల కంచెలు (Barbed fences) చూసే కళ్ళకు కాలాపానీ జైలు గోడల్లా మారాయి..

ఎప్పుడెప్పుడు ఈ ముళ్ల కంచెలు తొలగిస్తారా అని ఆశపడిన రోజులు ఉన్నాయి.. ఆ తరుణం వచ్చేసింది. చాలా రోజుల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ముళ్ల కంచెలు బైబై చెప్పాయి.. ఈమేరకు ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చుట్టూ ఉన్న ముళ్ల కంచెలు నేడు తొలగించారు.. ఓయూ అధికారులు, ఇన్ స్పెక్టర్ ఆంజనేయులు దగ్గరుండి ముళ్ల కంచెలు తీసివేయించారు. కాగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల పోరాటంతో ముళ్ల కంచెలు తీసివేసేందుకు ఓయూ అధికారులు ఒప్పుకున్నారు..

మరోవైపు బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం సాధించి.. 2014లో అధికారంలోకి వచ్చాక.. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, ఆందోళనలు నిషేధించింది. ఓయూ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు ఉన్న గేటుకు ముళ్లకంచెలు వేశారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలపై నిరంకుశంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎన్నో సార్లు ఓయూ విద్యార్థులు మండిపడ్దారు.. అదీగాక డిసెంబర్15న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వందలాది మంది విద్యార్థులు క్యాంపస్ పై ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ ఓయూ లైబ్రరీ నుంచి అడ్మినిస్ట్రేషన్ భవనం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.

తమ సమస్యలు వినిపించకుండా, భవనంలోకి ప్రవేశంచకుండా విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూన్న అధికారులపై మండిపడ్డారు.. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ చుటూ ఉన్న ముళ్ల కంచెలు తొలగించాలని వారి డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన ఓయూ అధికారులు గత పదేళ్లుగా ఉన్న ముళ్ల కంచెలను తొలగించారు..

You may also like

Leave a Comment