Telugu News » Dupli’cates’ : నగల షాపులో నకిలీ పోలీసుల హల్ చల్ …!

Dupli’cates’ : నగల షాపులో నకిలీ పోలీసుల హల్ చల్ …!

పట్టపగలు ఓ నగల షాపును లూఠీ చేసేందుకు విఫల యత్నం చేశారు దుండగులు.

by sai krishna

పట్టపగలు ఓ నగల షాపును లూఠీ చేసేందుకు విఫల యత్నం చేశారు దుండగులు.మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా(Medchal Malkaz Giri District)కీసర పోలీస్ స్టేషన్(Keesara Police Station)పరిధిలోని జ్యువెలరీ షాప్ లోనికి చొరబడి ఎస్ఓటీ పోలీసులం అంటూ హడావుడి చేశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


పోలీసులు వివరాల ప్రకారం…అహ్మద్ గూడ(Ahmed Guda) ప్రధాన రహదారిపై ఉన్న ఓం జ్యువెలర్స్ లోకి ఎస్ఓటీ పోలీసులం అంటూ ఇద్దరు వ్యక్తులు షాపులోకి చొరబడ్డారు.

అనుమానం వచ్చిన షాప్ యజమాని ఓం ప్రకాష్ పక్కనే ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కొత్త భాస్కర్ గౌడ్ కి సమాచారం అందించాడు. వెంటనే భాస్కర్ గౌడ్ పోలీసులకు సమాచారం అందించారు .

ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని కీసర పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే నిందితులు ఇద్దరు గతంలో ఎస్ఓటీ టీంకు ఇన్ఫార్మలుగా పనిచేసేవారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

You may also like

Leave a Comment