Telugu News » Viral video : కలిసొచ్చిన ఐకమత్యం…నోటికి చిక్కిన హైనాను వదిలేసిన మృగరాజు..!

Viral video : కలిసొచ్చిన ఐకమత్యం…నోటికి చిక్కిన హైనాను వదిలేసిన మృగరాజు..!

కాస్త తెలివున్న ఏ జంతువు సింహానికి ఎదరుపడదు. అది కూడా హంగ్రీసింహాం కంట్లో అస్సలు పడదు. అప్పుడు దొరికిన ఏ జంతువును లైన్ కింగ్(Line King) విడిచి పెట్టదు.

by sai krishna

కాస్త తెలివున్న ఏ జంతువు సింహానికి ఎదరుపడదు. అది కూడా హంగ్రీసింహాం కంట్లో అస్సలు పడదు. అప్పుడు దొరికిన ఏ జంతువును లైన్ కింగ్(Line King) విడిచి పెట్టదు. మాంచి ఆకలి మీద ఉందో ఏంటో ఓ సింహం కొన్ని హైనాలపై దాడి చేసింది.

ఓ హైనా(Hyena) సింహానికి చిక్కింది.విడిపించు కోలేక విలవిలలాడింది. కాకపోతే హైనాలకున్న ఐకమత్యం వల్ల సింహాం నోటికి చిక్కిన హైనా విడిపించుకోగలిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


ఆస్ట్రేలియా(Australia)కు చెందిన‌ మార్గ‌ట్‌(Margot), మ్యాడీ లోవె(Maddie Lowe)స‌ఫారీని సంద‌ర్శించిన క్ర‌మంలో ఈ ఘ‌ట‌న‌ను రికార్డు చేశారు. ఈ వీడియోలో హైనాల గుంపు ఉన్న ప్ర‌దేశానికి సింహం రావ‌డంతో భ‌య‌ప‌డిన హైనాలు పారిపోగా ఓ హైనాను సింహం వెంటాడి చేజిక్కించుకుంటుంది. హైనాను నోటకరుచుకుని దాడి చేస్తుండ‌గా మిగిలిన హైనాలు సింహం మీద‌కు ఉరికి హైనాను కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తాయి.

పలుమార్లు ప్ర‌యత్నించిన మీద‌ట హైనాను సింహం విడిచిపెట్ట‌డంతో హైనాల గుంపు వెనుదిర‌గ‌డం ఈ క్లిప్‌లో క‌నిపిస్తుంది. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ ఏకంగా 20 ల‌క్ష‌ల మందికి పైగా వీక్షించారు. హైనాను కాపాడుకునేందుకు హైనాల గుంపు ప్ర‌ద‌ర్శించిన స‌మ‌న్వ‌యం, పోరాట‌ప‌టిమ‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు గుప్పించారు.

You may also like

Leave a Comment