Telugu News » Pakistan : నాడు అపహాస్యం.. నేడు పొగడ్తలు..ఇస్రోపై పాక్ లీడర్ !!

Pakistan : నాడు అపహాస్యం.. నేడు పొగడ్తలు..ఇస్రోపై పాక్ లీడర్ !!

by umakanth rao
Pakisthan leader

 

 

Pakistan : చంద్రయాన్-3 (Chandrayaan-3) బుధవారం సాయంత్రం 6 గంటల 4 నిముషాలకు చంద్రుని ఉపరితలంపై దిగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ మంత్రి ఫాద్ హుసేన్ (Fawad Hussain) . ఇండియాను.. ముఖ్యంగా ఇస్రోను ప్రశంసల వర్షంతో ముంచెత్తారు. ‘మానవాళికి ఇది చరిత్రాత్మకమైన క్షణమని’ అభివర్ణించారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆయన తమ దేశ ప్రభుత్వాన్ని, మీడియాను కోరారు.

Chandrayaan 3: Former Pak leader who criticised ISRO earlier now says Lunar Mission as a

ఇస్రో కు మరీమరీ కంగ్రాట్యులేషన్స్ అని ట్వీట్ చేశారు. లోగడ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పని చేసిన ఈయన.. చంద్రయాన్-3 ప్రయోగం మానవాళికి.. ముఖ్యంగా ప్రజలకు, సైంటిస్టులకు, భారత స్పేస్ కమ్యూనిటీకి కూడా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు.

బుధవారం సాయంత్రం 6.15 గంటలకు పాక్ మీడియా దీన్ని లైవ్ గా ప్రసారం చేయాలని కోరుతున్నానన్నారు. అయితే ఈయనే 2019 లో చంద్రయాన్-2 ప్రయోగం సందర్భంగా ఇస్రోను తీవ్రంగా అపహాస్యం చేశారు.

ఈ మిషన్ కోసం భారత ప్రధాని మోడీ ప్రభుత్వం 900 కోట్లు ఖర్చు పెడుతోందని, ఇది ఏ మాత్రం సముచితం కాదని నాడు విమర్శించారు. తన ట్వీట్ లో ఆయన ‘ఇండియా ఫెయిల్డ్’ అనే పదాన్ని కూడా హ్యాష్ ట్యాగ్ గా వినియోగించారు. చంద్రయాన్-2 చివరి దశలో విఫలమైన విషయం గమనార్హం.

You may also like

Leave a Comment