Telugu News » Palakkad : ఐఐటీ పరిశోధకుల అద్భుత సృష్టి.. మానవ మూత్రంతో విద్యుత్..!

Palakkad : ఐఐటీ పరిశోధకుల అద్భుత సృష్టి.. మానవ మూత్రంతో విద్యుత్..!

నేటి జీవన విధానంలో విద్యుత్ అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. ఇప్పటికే సోలార్ ద్వారా కరెంట్ ఉత్పత్తిని కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఇంకా ప్రయోగాలు ఆపలేదు..

by Venu

నేటి కాలంలో మానవుని జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఆధునిక జీవన విధానంలో టెక్నాలజీ.. మనిషిని పూర్తిగా ఆక్రమించిందని తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో కొత్త కొత్త ప్రయోగాలకు ఆయువు పోస్తున్నారు. ఇప్పటికే ఊహకు అందని విధంగా దూసుకెళ్తున్న మనిషి.. తన అవసరాల కోసం ఎంతవరకైనా వెళ్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.

ఇక నేటి జీవన విధానంలో విద్యుత్ అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. ఇప్పటికే సోలార్ ద్వారా కరెంట్ ఉత్పత్తిని కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఇంకా ప్రయోగాలు ఆపలేదు.. ఈ క్రమంలో కాలుష్యకారక శిలాజ ఇంథనాలకు బదులు పునరుత్పాదక ఇంథనంపై దృష్టి సారించిన ఐఐటీ పాలక్కడ్‌ (Palakkad) పరశోధకులు పునరుత్పాదక ఇంథనాన్ని మూత్రం (Urine) నుంచి ఉత్పత్తిచేసి ఔరా అనిపించారు.

ఇందుకు సంబంధించిన పరిశోధనా పత్రాన్ని, ప్రముఖ ఆన్‌లైన్‌ జర్నల్‌ ‘సపరేషన్‌ అండ్‌ ప్యూరిఫికేషన్‌ టెక్నాలజీ’లో ప్రచురించారు. ఈ పునరుత్పాదక విద్యుత్‌ తయారీ కోసం వారు కొత్తగా ఎలక్ట్రో కెమికల్‌ రిసోర్స్‌ రికవరీ రియాక్టర్‌ (ERRR)ను తయారుచేశారు. ఇది విద్యుత్‌తో పాటు బయో ఫెర్టిలైజర్‌ (Bio-Fertilizer)ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సరికొత్త సాంకేతికతతో మూత్రంలోని అయానిక్‌ బలాన్ని ఉపయోగిస్తారు.

విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ఎలక్ట్రోకెమికల్‌ ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది. అలాగే నత్రజని, భాస్వరం, మెగ్నీషియం బయోఫెర్టిలైజర్‌ తయారీకి ఉపయోగపడుతుంది. ఈ ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీలో ఎలక్ట్రోకెమికల్‌ రియాక్టర్‌, అమ్మోనియా అడ్సార్ప్షన్‌ కాలమ్‌, డీకోలరైజేషన్‌, క్లోరినేషన్‌ ఛాంబర్‌, ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌ మానిఫోల్డ్స్‌ ఉంటాయి. ఈ చర్యల ద్వారా విద్యుత్‌ను, సహజ ఎరువును ఉత్పత్తిచేస్తారు.

మరోవైపు సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ గంగాధరన్ నేతృత్వంలోని రీసెర్చ్ స్కాలర్ సంగీత వి, ప్రాజెక్ట్ సైంటిస్ట్ శ్రీజిత్ పిఎం, డిపార్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ రిను అన్నా కోశితో కూడిన బృందం దీని కోసం పేటెంట్ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST), భారత ప్రభుత్వం (GOI) కింద.. సైన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం ద్వారా నిధులు సమకూరుస్తుంది.

You may also like

Leave a Comment