Telugu News » Parliament: కమలం పువ్వు, మణిపూరి తలపాగా…పార్లమెంట్ సిబ్బంది కొత్త డ్రెస్ కోడ్

Parliament: కమలం పువ్వు, మణిపూరి తలపాగా…పార్లమెంట్ సిబ్బంది కొత్త డ్రెస్ కోడ్

పార్లమెంట్ సిబ్బంది ధరించనున్న నెహ్రూ జాకెట్, ఖాకీ ప్యాంట్లను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) రూపొందించింది.

by Prasanna
Parliament new dress code

లోక్‌సభ, రాజ్యసభ సిబ్బంది ఇకపై కొత్త యూనిఫాం (New Uniform)లో కనిపించబోతున్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు (Parliament) ప్రత్యేక సమావేశాల్లో సిబ్బంది కొత్త డ్రెస్‌కోడ్‌ (Dress Code)లోనే విధులకు హాజరుకానున్నారు. చాంబర్ అటెండెంట్స్, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు, మార్షల్స్ సహా అందరూ సరికొత్త యూనిఫాం ధరించనున్నారు.

Parliament new dress code

పార్లమెంట్ సిబ్బంది ధరించనున్న నెహ్రూ జాకెట్, ఖాకీ ప్యాంట్లను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) రూపొందించింది. సూట్‌కు బదులుగా ఎరుపు, నీలం రంగు కలగలిసిన మెజెంటా లేదంటే ముదురు గులాబీ రంగు నెహ్రూ జాకెట్ ధరిస్తారు. వారి చొక్కాలపై కమలం పువ్వును డిజైన్ చేశారు.

ఇప్పుడిదే విమర్శలకు కారణమైంది.  ఇది కాషాయీకరణలో భాగమేనని, పార్లమెంటు కాషాయీకరణ కాబోతోదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు సభల్లోని ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.  సమావేశాల ఎజెండా మాత్రం ప్రకటించకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ సమావేశాల్లోనే దేశం పేరును భారత్‌గా మార్చే ప్రతిపాదన తీసుకొస్తారని అందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాజ్యాంగంలో ఇప్పటికే ఇండియా అంటే భారత్ అని స్పష్టంగా ఉందని, ఈ నేపధ్యంలో పేరు మార్పు చేయవలసిన అవసరం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

You may also like

Leave a Comment