Telugu News » Parliament Elections : తెలంగాణలో అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ..!

Parliament Elections : తెలంగాణలో అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ..!

విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించి రాష్ట్రాన్ని చుట్టేసే ప్రయత్నంలో బీజేపీ (BJP) నేతలున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీకి సానుకూలత పెరిగిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

by Venu

తెలంగాణ (Telangana) బీజేపీ ముఖ్య నేతలు పార్లమెంట్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకొన్నారని తెలుస్తోంది. మార్చిలో నోటిఫికేషన్ వెలువడనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వేగం పెంచారు. ఈ క్రమంలో తెలంగాణలో 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేసింది. నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్ ఇచ్చింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దక్కడంతో లో‌క్‌సభ ఎన్నికల్లో గెలిచి సత్తాచాటాలని భావిస్తుంది.

bjp-big-plans-for-parliament-elections

వారిలో సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌ రెడ్డి, కరీంనగర్‌-బండి సంజయ్‌, నిజామాబాద్‌-అర్వింద్, చేవెళ్ల-కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ఖమ్మం-డాక్టర్‌ వెంకటేశ్వరరావు, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ లను అభ్యర్థులుగా ఖరారు చేసింది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకే బీజేపీ మొగ్గు చూపుతోందనే ప్రచారం ఊపందుకొంది. అదీగాక ఇప్పటికే కిషన్ రెడ్డి (Kishan Reddy), బీఆర్ఎస్‌ (BRS)తో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు.. మహబూబ్‌నగర్ స్థానం నుంచి డీకే అరుణ్, జితేందర్ రెడ్డి ఇద్దరూ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇద్దరిలో ఒకరి పేరును నాయకత్వం ఖరారు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.. ఇక మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ ఆసక్తి చూపుతుండగా.. మురళీధర్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తుంది. మరోవైపు మల్కాజ్‌గిరి నుంచి ప్రైవేట్‌ విద్యా సంస్థల అధిపతి మల్క కొమురయ్య పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తుంది.

ఇదిలా ఉండగా విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించి రాష్ట్రాన్ని చుట్టేసే ప్రయత్నంలో బీజేపీ (BJP) నేతలున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీకి సానుకూలత పెరిగిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధిరాకంలో ఉన్న దేశంలో మోడీ (Modi) ఉండాలనే నిదానాన్ని ప్రజల్లోకి వెళ్ళేలా వ్యూహరచన చేశారు.. ఈ ఎన్నికల్లో రామ మందిర నిర్మాణం ఓటు బ్యాంకుగా కలిసి వస్తుందనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment