జనసేన అధినేత(Janasena Chief) పవన్‌కల్యాణ్(Pawan Kalyan) లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం జనసేన కార్యాలయంలో తన సోదరుడు నాగబాబు, జనసేన నేతలతో కలిసి పాల్గొన్న పవన్ వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.
అనంతరం జనసేనాని మాట్లాడుతూ.. పిఠాపురం జనసేన కార్యాలయమే నా స్వగృహం అంటూ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో విజయకేతనం ఎగరవేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ ఏడాది ప్రజలకు మేలు జరగాలని.. రైతులు, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలన్నారు. ఇక, తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు పవన్ కల్యాణ్. అదేవిధంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ..పిఠాపురంలో కొత్త టెక్నాలజీలో డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు.
ఎంతమంది మిథున్ రెడ్డిలు వచ్చినా పవన్ కల్యాణ్ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు. పిఠాపురంలో పోలీసులకు తెలియకుండానే నోట్ల కట్టలు తరలిపోతున్నాయని, ఆ డబ్బంతా మంత్రి దాడిశెట్టి రాజాది అని వాళ్ల డ్రైవర్ చెప్పాడని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్‌కు భారీ మెజారిటీ ఇవ్వడానికి పిఠాపురంలో టీడీపీ పని చేస్తుందని స్పష్టం చేశారు.