Telugu News » Ugadi : ప్రధాన పార్టీల పంచాంగం.. మంత్రులకు తప్పని మరణం..!?

Ugadi : ప్రధాన పార్టీల పంచాంగం.. మంత్రులకు తప్పని మరణం..!?

వాహన ప్రమాద సూచన ఉంది కాబట్టి ఎక్కువ ప్రయాణాలు చేయొద్దని సూచించారు. ఇక కేటీఆర్ (మకర రాశి) ఆదాయ, వ్యయాలు సమానమని, రాజపూజ్యం, ప్రజాబలం బాగుందని, అవమానాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు.

by Venu
Sugarcane farmers are the target..Nizamabad Lok Sabha election is the only slogan!

తెలుగు వారి కొత్త సంవత్సరం అయిన ఉగాది (Ugadi)ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకొంటున్నారు. క్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని భగవంతుడిని వేడుకొంటున్నారు. మరోవైపు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. పంచాంగ పఠనాలతో సందడి నెలకొంది. అలాగే పార్లమెంట్ ఎన్నికల ముందు పండుగ రావడంతో.. ప్రధాన పార్టీల కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం ఆసక్తిగా మారింది.

గాంధీ‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో భాగంగా చిలుకూరి శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ ఏడాది పరశురాముడిలా పని చేస్తారని తెలిపారు. అలాగే గత అక్టోబర్ నుంచి సింహంలా పనిచేశారని క్రోధి నామ సంవత్సరంలో కూడా మంచి జరుగుతుందని వివరించారు. ప్రతిపక్షం మరింత వీక్ అవుతుందని, కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రాబోతున్నదని పేర్కొన్నారు.

అదేవిధంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి రాజయోగం ఉందని, ప్రధానమంత్రి పదవిలో మార్పులు సంభవిస్తాయని శ్రీనివాస మూర్తి వెల్లడించారు. మంత్రుల మరణాలు సంభావిస్తాయని తెలిపిన ఆయన.. ఓ పత్రిక యజమాని అనారోగ్యంతో మరణిస్తారని పేర్కొన్నారు. తప్పు చేసిన రాజకీయనేతలు కూడా శిక్షార్హులు అవుతారన్నారన్నారు. మరోవైపు తెలంగాణ (Telangana) భవన్‌లో సైతం ఉగాది వేడుకలను నిర్వహించారు.

కేటీఆర్‌ (KTR), పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. రాబోయే ఎన్నికల్లో పాలకపక్షాలకు కష్టాలు కనిపిస్తున్నాయని, ప్రతిపక్షంగా ఉన్నవారు ప్రయత్నం చేస్తే విజయాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే కేసీఆర్‌ (KCR) రాశిలో(కర్కాటకం) అత్యంత సంతోషకరంగా ఆదాయ, వ్యయాలు కనిపిస్తున్నాయని.. వారి మాటకు, గమనానికి అడ్డు ఉండదని తెలిపారు. కానీ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు..

వాహన ప్రమాద సూచన ఉంది కాబట్టి ఎక్కువ ప్రయాణాలు చేయొద్దని సూచించారు. ఇక కేటీఆర్ (మకర రాశి) ఆదాయ, వ్యయాలు సమానమని, రాజపూజ్యం, ప్రజాబలం బాగుందని, అవమానాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. మాటను కట్టడి చేసుకోవాలని లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించిన పండితులు.. ప్రయాణాలలో ఇబ్బంది ఉంటుందని తెలిపారు.

బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)తోపాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది వ్యక్తుల మధ్య అకాల వైరాలు పెరిగినా అధినాయకత్వం వల్ల ఒకటిగా కలిసిపోతారని సమిష్టి విజయం సాధించాలనే లక్ష్యం ఏర్పడుతుందన్నారు. సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం కీలకంగా మారిన సందర్భంలో.. రెండేళ్ల క్రితం నాటి పంచాంగం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సంతోష్ కుమార్ శాస్త్రి ఆనాటి ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణం వినిపిస్తూ.. నరసింహుడికి త్రినేత్రం ఉన్నట్లు, కేసీఆర్‌కు కూడా మూడవ నేత్రం ఉందన్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో త్రినేత్రంతో గ్రహించగల మేధావి అని పేర్కొన్నారు.

అయితే పదవిలో ఉండగా బీఆర్ఎస్ పెద్దలు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇతరుల ఫోన్ కాల్స్ విన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కేసీఆర్ మూడో నేత్రం ఫోన్ ట్యాపింగే అంటూ సెటైర్లు వేస్తూ.. ఫన్నీ కామెంట్స్ చేయడం కనిపిస్తోంది..

You may also like

Leave a Comment