Telugu News » TDP : లోకేష్ యువగళం ముగింపు సభ కోసం పవన్ త్యాగం.. కారణం ఇదేనా..?

TDP : లోకేష్ యువగళం ముగింపు సభ కోసం పవన్ త్యాగం.. కారణం ఇదేనా..?

ఈ సభకి పవన్ హాజరు కాకపోవడానికి పలుకారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది యువగళం ముగింపు సభ కాబట్టి.. లోకేష్‌కు క్రెడిట్ ఇచ్చేలా పూర్తిస్థాయిలో సభ జరిగితే బాగుంటుందని.. అందువల్ల పవన్ రాకపోవడం కూడా ఒకందుకు మంచిదే అనే ప్రచారం జనసేన.. టీడీపీ వర్గాలలో నుంచి వినిపిస్తోంది.

by Venu

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Lokesh) యువగళం పేరుతో పాదయాత్ర (Yuva Galam Padayatra) చేపట్టిన విషయం తెలిసిందే.. వైసీపీ (YCP) ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు.. జనవరి 27న కుప్పంలో (Kuppam) ప్రారంభమైంది. ఇప్పటి వరకి పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా ఈ పాద యాత్ర సాగింది.

కాగా రెండో దశ పాదయాత్ర సైతం ఇటీవల ప్రారంభించారు లోకేష్. మరోవైపు యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరంలో ఏర్పాటు చేయనున్నారు టీడీపీ నేతలు. ఈ సభ కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం..

అయితే పాదయాత్ర ముగింపు సభకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హాజరు కానున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఈ సభకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరు కావడం లేదని తెలుస్తోంది. కాగా 17 న జరగవలసిన బహిరంగ సభ.. తుపాను కారణంగా డిసెంబర్ 20 న నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఇది ఎన్నికల సన్నాహాక సభ కావడంతో ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు.

ఇక ఈ సభకి పవన్ హాజరు కాకపోవడానికి పలుకారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది యువగళం ముగింపు సభ కాబట్టి.. లోకేష్‌కు క్రెడిట్ ఇచ్చేలా పూర్తిస్థాయిలో సభ జరిగితే బాగుంటుందని.. అందువల్ల పవన్ రాకపోవడం కూడా ఒకందుకు మంచిదే అనే ప్రచారం జనసేన.. టీడీపీ వర్గాలలో నుంచి వినిపిస్తోంది. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా నిర్వహించే సభలను టీడీపీ, జనసేన కలిసి నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

You may also like

Leave a Comment