తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ పార్టీలన్నీ పోరుకు సిద్దం అవుతున్నాయి. ఆయా పార్టీలు తమ అభ్యర్ధులను బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఎస్పీ (BSP), వైఎస్సాఆర్ తెలంగాణ (YSR Telangana) పార్టీలు రంగంలో నిలబడటానికి సిద్దం అయ్యాయి. టీడీపీ (TDP) కూడా పోటీ చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.
మరోవైపు జనసేన విషయంలో ఏ క్లారిటీ రాలేదని అంతా అనుకొంటున్న సమయంలో జనసేన పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసింది. బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం కనిపిస్తోందని, ఇరు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పకనే చెబుతున్నారు జనసేన నేతలు. మరోవైపు హైదరాబాద్‌లో జనసేన రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో రాష్ట్ర జనసేన నాయకులు(Janasena Leaders), కార్యకర్తలు భేటీ అయ్యారు.
ఎన్నికల పోటీపై పార్టీ నేతల్లో సందిగ్ధత ఏర్పడంతో తమ అభిప్రాయాలను పవన్‌కు వివరించినట్టు వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుంటే క్యాడర్ బలహీనపడే అవకాశం ఉందనే విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుంటే క్యాడర్ బలహీనపడే అవకాశం ఉందనే విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.
కాగా రాష్ట్ర కార్యాలయంలో నాయకుల అభిప్రాయాలను విన్న పవన్ కల్యాణ్ ఎన్నికల పోటీ విషయంలో రెండు మూడు రోజుల్లో ఫైనల్ అవున్నట్టు జనసేన నాయకులు వెల్లడించారు. మరోవైపు బీజేపీ అభ్యర్థుల జాబితా సిద్ధమవుతుండగా.. పవన్ నివాసానికి.. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వెళ్లి చర్చలు జరపడం పొత్తులో భాగమేననే ప్రచారం జోరందుకోంది. సుమారు గంటకు పైగా డిస్కస్ చేసిన నేతలు చర్చల సారాంశాన్ని కేంద్ర నాయకత్వానికి తెలిపిన తర్వాతే పొత్తుపై అడుగులు ముందుకు వేసే అవకాశం ఉంది. అయితే ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకొన్న జనసేన పార్టీ ఇక్కడ మాత్రం బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల నుండి సమాచారం..