Telugu News » Pawan Kalyan : కాకినాడను టార్గెట్ చేసిన పవన్.. అందుకేనా..?

Pawan Kalyan : కాకినాడను టార్గెట్ చేసిన పవన్.. అందుకేనా..?

కాకినాడ నగరపాలక సంస్ధ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు వచ్చే ఎన్నికల్లో టీడీపీ(TDP) మద్దతు ఉంటుంది కాబట్టి ఈసారి కాకినాడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశపై పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది.

by Venu

జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాకినాడ(Kakinada)పై దృష్టి సారించారు.. రేపటి నుంచి మూడు రోజులపాటు కాకినాడలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ క్రమంలో అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో విడిగా విడిగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ మధ్య తరచుగా కాకినాడలో పర్యటిస్తున్న పవన్.. గత వారంలో మూడు రోజులు ఇక్కడే మకాం వేశారు..

Double engine government should come under the leadership of the prime minister

కాస్త విరామం తర్వాత మళ్లీ గురువారం నుంచి పవన్ పర్యటనతో జనసేన వర్గాలతో పాటు ఆశావహులు, మిగతా పార్టీ నేతల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సహా పలు పార్టీల నేతలు జనసేన వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాకినాడలో మొత్తం 50 డివిజన్ ఉండగా.. 22 డివిజన్ ల రివ్యూ ముగిసింది.. మిగతా డివిజన్ల రివ్యూ పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో చేయనున్నారు..

ఇకపోతే కాకినాడ నగరపాలక సంస్ధ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు వచ్చే ఎన్నికల్లో టీడీపీ(TDP) మద్దతు ఉంటుంది కాబట్టి ఈసారి కాకినాడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశపై పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే కాకినాడ సిటీలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (Dwarampudi Chandrashekar Reddy)ని పవన్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే జనసేనాని కాకినాడను ప్రత్యేకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు తగ్గట్టుగా జనసేనాని పార్లమెంట్ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టారంటున్నారు. ఈ క్రమంలో కాకినాడ సిటీ అసెంబ్లీ స్థానంపై కూడా ఆయన దృష్టి సారించినట్టు సమాచారం.. ఎన్నికల వరకు జనాల్లో బలంగా నాటుకుపోవాలనే ఉద్దేశ్యంతో పవన్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉంటున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే జనసేన పై వ్యాపిస్తున్న నెగెటివ్ టాక్ ని ఈ ఎన్నికల విజయంతో మార్చేయాలనే సంకల్పంతో పవన్ ఉన్నట్టు సమాచారం.. మరి ఏమేరకు పవన్ వ్యూహాలు ఫలిస్తాయో చూడాలి..

You may also like

Leave a Comment