భారత ప్రధాని నరేంద్రమోడీ (PM MODI) కీలక ప్రకటన చేశారు. సంకల్ప పత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టో(BJP Manifesto) విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో సంభాషించారు. వచ్చే పదేళ్లు దేశానికి కీలకం అని చెప్పిన ప్రధాని..మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా రాజీపడేది లేదన్నారు.
నాలుగు స్తంభాల ఆధారంగా సంకత్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను తయారు చేశామని, దీనికి అధ్యక్షత వహించిన రక్షణమంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు మోడీ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరలు(Petrol prices decrease) తగ్గిస్తామని ప్రధాని మోడీ స్పష్టంచేశారు. 6జీ టెక్నాలజీ అమలుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అదేవిధంగా ఆటోమొబైల్, సెమీ కండక్టర్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగం అభివృద్ధి, ఎలక్ట్రానిక్ హబ్‌గా భారతదేశాన్ని తయారు చేస్తామన్నారు.అంతేకాకుండా ప్రపంచ పర్యాటక కేంద్రంగా దేశాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
అంతేకాకుండా దేశ నలు మూలలా బుల్లెట్ ట్రైన్ల(Bullet Trains)ను తీసుకొస్తామన్నారు. ఇప్పటికే ముంబై టు అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ పనులు పూర్తి కావొచ్చయన్నారు. 2026లో తొలి బుల్లెట్ ట్రైన్ పట్టాలు ఎక్కుతుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ఉత్తర, దక్షిణ, తూర్పు భారత్‌కు కూడా బుల్లెట్ ట్రైన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అందుకోసం సర్వే పనులను కూడా త్వరలోనే చేపడుతామని ప్రధాని మోడీ స్పష్టంచేశారు. చివరగా, వచ్చే ఐదేళ్ల కాలం పాటు ఉచిత రేషన్ సదుపాయాన్ని నిరుపేదల కోసం కంటిన్యూ చేస్తామని ప్రకటించారు.