Telugu News » Mudragada Padmanabham: కష్టం వస్తే షూటింగ్‌లకు వచ్చి చెప్పాలా?.. ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..!

Mudragada Padmanabham: కష్టం వస్తే షూటింగ్‌లకు వచ్చి చెప్పాలా?.. ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..!

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan)పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం(Pithapuram)లో హీరోని తన్ని తరిమేయాలని.. అలా చేస్తే సినిమా నటులు ఇక రాజకీయాల్లోకి రారు అని సంచలన ఆరోపణలు చేశారు.

by Mano
Mudragada Padmanabham: Should you come to the shootings and say it?.. Mudragada's sensational comments..!

పిఠాపురం ప్రజలకు కష్టం వస్తే షూటింగ్‌లకు వెళ్లి చెప్పుకోవాలా? అంటూ ప్రశ్నించారు. షూటింగ్‌లు చేసుకోవడానికి ఎమ్మెల్యే(MLA) పదవి కావాలా? అంటూ మండిపడ్డారు. ముఖానికి రంగు వేసుకుని తైతక్కలాడుతూ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం దృష్టిలో 175 నియోజకవర్గాలలో పిఠాపురం నెంబర్1 గా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

సీఎంకు పిఠాపురం నెంబర్ వన్ అయితే పులివెందుల నెంబర్ 2 అని వ్యాఖ్యానించారు. పెద్దలు పిల్లలను అదుపులో పెట్టాలని సూచించారు. పిఠాపురంలో 2,30,000 ఓట్లు ఉంటే పవన్ 3లక్షలు మెజారిటీతో గెలుస్తానంటున్నాడని ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు. అదేవిధంగా సీఎం జగన్‌పై శనివారం జరిగిన దాడిపై స్పందిస్తూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వారిని ఖండించాలన్నారు.

అధికారం కోసం ఒక పార్టీ అధినేతపై దాడి చేయడం సిగ్గుచేట్టన్నారు. హత్యా ప్రయత్నాలు ఎంతవరకు న్యాయమని.. మన రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఈ విధంగా చేయడం సంప్రదాయమంటూ ప్రశ్నించారు. సాంప్రదాయమా అంటూ ప్రశ్నించారు. దాడి చేసిన వారిన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

You may also like

Leave a Comment