రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన అధికారులు.. విచారణలో వెల్లడి అయిన అంశాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.. ఈ క్రమంలో ముందు ముందు ఈ కేసు ఊహించని విధంగా మలుపులు తిరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలైయ్యాయి.. ప్రతిపక్షాలు సైతం ఈ వ్యవహారంపై మండిపడుతున్నాయి..

తెలంగాణలో ఈ సారి రెండంకెల సీట్లు సాధిస్తామని తెలిపిన కేంద్రం మంత్రి.. కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ మాత్రమే పోరాటం చేసిందని పేర్కొన్నారు.. అందుకే తెలంగాణలో తమ ఓటు బ్యాంకు 7 శాతం నుంచి 14 శాతానికి పెరిగిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర పునర్విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశామని పేర్కొన్న ఆయన.. గిరిజన యూనివర్సిటీ భూమి విషయంలో కేసీఆర్ ఆరేళ్లు స్పందించలేదని ఆరోపించారు..
అందుకే యూనివర్సిటీ విషయంలో ఆలస్యం జరిగిందని వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్, బీజేపీ కలిసి కూల్చాలని చూస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు.. కవితను గతంలో అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎందుకు చేశారని ప్రశ్నించడం సరికాదని సూచించారు.. ప్రజల సేవకునిగా ఎన్నుకోబడిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండే.. ఎలాగని ఆలోచించిన ప్రజలు.. ఆయనను పర్మినెంట్ గా ఫామ్ హౌస్ కు పరిమితం చేశారని ఆరోపించారు..