Telugu News » PM Modi: కాంగ్రెస్ దేశాన్ని త‌ప్పుదోవ‌ ప‌ట్టించింది: ప్ర‌ధాని మోడీ

PM Modi: కాంగ్రెస్ దేశాన్ని త‌ప్పుదోవ‌ ప‌ట్టించింది: ప్ర‌ధాని మోడీ

ఆర్టిక‌ల్ 370 పేరుతో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని త‌ప్పుదోవ‌ప‌ట్టించిందని ప్ర‌ధాని మోడీ(PM Modi) అన్నారు. కొన్ని రాజ‌కీయ కుటుంబాలు మాత్ర‌మే ఆ ఆర్టిక‌ల్ వ‌ల్ల ల‌బ్ధి పొందిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. కశ్మీర్లో గురువారం పర్యటించిన ప్రధాని మోడీ పలు అభివృద్ధి ప్రాజెక్ట్లను ప్రారంభించారు.

by Mano
PM Modi: Congress has misled the country: PM Modi

ఆర్టిక‌ల్ 370 పేరుతో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని త‌ప్పుదోవ‌ప‌ట్టించిందని ప్ర‌ధాని మోడీ(PM Modi) అన్నారు. కొన్ని రాజ‌కీయ కుటుంబాలు మాత్ర‌మే ఆ ఆర్టిక‌ల్ వ‌ల్ల ల‌బ్ధి పొందిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. కశ్మీర్లో గురువారం పర్యటించిన ప్రధాని మోడీ పలు అభివృద్ధి ప్రాజెక్ట్లను ప్రారంభించారు. అనంతరం శ్రీన‌గ‌ర్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు.

PM Modi: Congress has misled the country: PM Modi

ఆర్టిక‌ల్ 370(Article 370) ని ర‌ద్దు చేసిన త‌ర్వాత ఆంక్ష‌ల నుంచి స్వేచ్ఛ దొరికింద‌న్నారు. త‌మ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌న్న విష‌యాన్ని జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌లు ఆల‌స్యంగా గ్ర‌హించార‌ని మోడీ అన్నారు. కొన్ని కుటుంబాల ల‌బ్ధి కోస‌మే జ‌మ్మూక‌శ్మీర్‌ను సంకెళ్ల‌లో వేసేశార‌న్నారు. ఇవాళ జ‌మ్మూక‌శ్మీర్‌లో 370లేదు అని, దీని వ‌ల్ల ఆ రాష్ట్ర యువ‌త ప్ర‌తిభ‌కు గౌర‌వం ద‌క్కుతోంద‌ని, ఫ‌లితంగా కొత్త అవ‌కాశాలు వ‌స్తున్న‌ట్లు మోడీ చెప్పారు.

ఇప్పుడు స‌మాన హ‌క్కులు, స‌మాన అవ‌కాశాలు ల‌భిస్తున్నాయ‌న్నారు. తాను జమ్ముకశ్మీర్ ప్రజలను కుటుంబంలా భావిస్తానన్నారు. ‘కుటుంబ సభ్యులు నా హృదయంలో ఉంటారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి నేను హామీ ఇస్తున్నాను. జమ్ముకశ్మీర్లో అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవు.’ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

భవిష్యత్తులో జమ్ముకశ్మీర్ విజయగాథ ప్రపంచానికి కేంద్రంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్లోని సరస్సుల్లో ఎక్కడ చూసినా కమలం కనిపిస్తుందన్నారు. జమ్ముకశ్మీర్ క్రికెట్ లోగోపై కూడా కమలం గుర్తు ఉందని, బీజేపీ గుర్తు కూడా కమలమే అని చెప్పారు. జమ్ముకశ్మీర్‌కు కమలంతో లోతైన అనుబంధం ఉండడం యాదృచ్చికమా లేక ప్రకృతి సంకేతమా? అని మోడీ తెలిపారు.

దేశానికి జమ్ముకశ్మీర్ తలమానికమని అన్నారు. శ్రీనగర్ ఇప్పుడు దేశ పర్యాటక పరిశ్రమకు కేంద్రంగా ఉందని తెలిపారు. శ్రీనగర్ను ఉద్దేశించి భూమిపై ఉన్న స్వర్గానికి వచ్చిన అనుభూతి మాటల్లో చెప్పలేనిదని అభివర్ణించారు. ‘చలో ఇండియా’ కార్యక్రమం కింద కనీసం 5 మంది కుటుంబ సభ్యులను భారత పర్యటనకు పంపాలని ప్రవాస భారతీయులను ప్రధాని కోరారు.

అంతకుముందు శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో ‘విక్షిత్ భారత్ విక్షిత్ విక్షిత్ జమ్ముకశ్మీర్’ కార్యక్రమంలో షోపియాన్, జమ్ము, కుప్వారా, శ్రీనగర్, గందర్‌బల్, బందీపురా, కథువాకు చెందిన ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా సంభాషించారు. అదేవిధంగా శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో ప్రధాని మోడీ రూ.6400 కోట్ల విలువైన 53 ప్రాజెక్ట్లను ప్రారంభించారు. కాగా, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో శ్రీనగర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

You may also like

Leave a Comment