Telugu News » కేంద్ర నిధులను బీఆర్ఎస్ దోచుకుంటోంది…..!

కేంద్ర నిధులను బీఆర్ఎస్ దోచుకుంటోంది…..!

ఓ ఉద్యమంలా బీఆర్ఎస్ దోపిడీని కడిగిపారేస్తామని ప్రధాని మోడీ తెలిపారు.

by Ramu
pm modi fire on brs and congress in nizamabad public meeting

-దొరికిందల్లా దోచుకోవడమే బీఆర్ఎస్ కు తెలిసిన విద్య
-ప్రజాస్వామ్యాన్ని కుటుంబ స్వామ్యంగా మార్చారు
-తెలంగాణలో ఒక్క కుటుంబమే అంతా కబళించింది
-ఎన్డీఏలో చేరతానని కేసీఆర్ నన్ను కలిశారు
-దానికి నేనా ససేమేరా అన్నాను
-ప్రతిపక్షంలోనైనా కూర్చుంటాం కానీ ప్రజా నమ్మకాన్ని కోల్పోము
-కర్ణాటకలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నిధులు పంపింది
-ఆ రెండు పార్టీల మధ్య చీకటి పొత్తు నడుస్తోంది
-ఘామాండియా ఘట్ బంధన్ ను నమ్మవద్దు
-తెలంగాణ కోసం బీజేపీ ఏదైనా చేస్తుంది
-ఇది మోడీ ఇచ్చిన మోడీకి నిదర్శనం
-ప్రతి బూత్ లో గెలవండి
-కమల్ హర్ ఘర్ పహుంచే
-నిజామాబాద్ సభలో మోడీ

యువతను మోసం చేయడమే బీఆర్ఎస్ (BRS) లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోడీ (PM Modi) విరుచుకు పడ్డారు. తమపై నమ్మకం ఉంచి ఐదేండ్ల పాటు అవకాశం (Chance) ఇవ్వండన్నారు. తాము అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ తప్పులన్నింటినీ ఎండగడతామన్నారు. ఓ ఉద్యమంలా బీఆర్ఎస్ దోపిడీని కడిగిపారేస్తామని ప్రధాని మోడీ తెలిపారు.

pm modi fire on brs and congress in nizamabad public meeting

నిజామాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ…. భారత మాత వేషధారణలో వచ్చిన బాలికను ప్రధాని మోడీ అభినందించారు. ఎన్టీపీసీ యూనిట్ కు తానే శంకుస్థాపన చేశానన్నారు. 8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం తనకు చాలా సంతోషంగా వుందన్నారు. ఇది మోడీ ఇచ్చే గ్యారెంటీకి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజల కోసం కేంద్రం, బీజేపీ ఏమైనా చేస్తుందన్నారు.

ఘమాండియా ఘట్ బంధన్ ను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. మీ మద్దతుతోనే మీ బిడ్డ దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేసి దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. మీ ఉత్సాహానికి సలాం అని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను బీఆర్ఎష్ దోచుకుంటుందోంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దొరికిందల్లా దోచుకోవడమే వాళ్లకు తెలిసిన విద్య అని ఫైర్ అయ్యారు.

ప్రజాస్వామ్యాన్ని కుటుంబ స్వామ్యంగా మార్చారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో కుటుంబ వాదానికి చోటు లేదన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేశారని చెప్పారు. కానీ ఒక్క కుటుంబమే అంతా కబళించిందని మండిపడ్డారు. లక్షలాది కుటుంబాల ఆకాంక్షను కుటుంబం కబ్జా చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు, అత్తింటి వాళ్లు అంతా వాళ్లేనంటూ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అవినీతిని వాళ్లు ప్రోత్సహిస్తున్నారన్నారు. తెలంగాణకు చేయాల్సిందంతా కేంద్రం ద్వారా చేస్తున్నామని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు స్వేఛ్చ రాలేదన్నారు. గుజరాతీ బిడ్డ సర్ధార్ వల్లబాయ్ పటేల్ కృషితో స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ఇప్పుడు మరో గుజరాతి బిడ్డ మీకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్నాడన్నారు.

కుటుంబ పాలనతో యువత నష్టపోతోందన్నారు. తెలంగాణ యువతకు ఎలాంటి అవకాశాలు దొరకడం లేదన్నారు. సామన్యుల గురించి ఆలోచించి పని చేసేది బీజేపీ మాత్రమేనన్నారు. దేశం మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ను విస్మరించిందన్నారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బీటీమ్ గా మారిందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి ఖాయమమన్నారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ చీకటి పొత్తు పెట్టుకుందన్నారు.

కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నిధులు పంపిందన్నారు. తెలంగాణ ప్రజలను దోచి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నిధులిచ్చిందన్నారు. వంద శాతం నిజం చెప్పేందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఢిల్లీకి వచ్చి కేసీఆర్ తనను కలిశారన్నారు. తాను కూడా ఎన్డీఏలో చేరతానన్నారని చెప్పారు. కానీ దానికి తాను ఒప్పుకోలేదన్నారు.

కేసీఆర్ అవినీతి బాగోతాన్ని తాను చెప్పానన్నారు. తాను కేటీఆర్ కు బాధ్యతలు ఇస్తానని కేసీఆర్ అన్నారన్నారు. దీంతో మీరేమైనా రాజులా అని ప్రశ్నించానన్నారు. ఆ తర్వాత నుంచి తనను ఎప్పుడూ కలవలేదన్నారు. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాం కానీ ప్రజల నమ్మకాన్ని మాత్రం కోల్పోమన్నారు. అధికార దాహంతో కాంగ్రెస్ అల్లాడుతోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ ఇప్పుడు కొత్త మాటలు మాట్లాడుతోందన్నారు. ఎంత జనాభా వుంటే అంత హక్కు అని అంటోందన్నారు. దక్షిణ భారత్ ను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందన్నారు. మైనార్టీలను వంచించేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోందన్నారు. తమిళనాడులో ఆలయాలపై ప్రభుత్వానికి అధికారం ఉందన్నారు. ఆలయాలను ప్రభుత్వం లాక్కొంటోందన్నారు. కానీ మైనార్టీల ఆలయాలను ముట్టుకోదన్నారు. తప్పుడు వ్యాఖ్యలతో ప్రజలను కాంగ్రెస్ రెచ్చగొడుతోందన్నారు.

దేశంలో పేదలకు ఎంతో సాయం అవసరమన్నారు. ఆ పేదలకు సేవ చేయడం వారి సంక్షేమం కోసం తాము పని చేస్తున్నామన్నారు. గత ఐదేండ్లలో 13.5 లక్షల కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామన్నారు. తెలంగాణ ప్రజలు తనపై ఐదేండ్లు నమ్మకం ఉంచండన్నారు. బీఆర్ఎస్ దోచుకున్నదంతా ప్రజల ముందు ఉంచుతానన్నారు. కాంగ్రెస్ వాళ్లు చెప్పే తప్పుడు వాగ్దానాలు నమ్మకండన్నారు.

అధికారంలోకి వచ్చాక అనేక మెళికలు పెడతారన్నారు. ఇచ్చిన మాటలు అమలు చేసిన ట్రాక్ రికార్డు బీజేపీకి ఉందన్నారు. జాబ్ మేళాల ద్వారా యువతకు ఉద్యోగాలిచ్చామన్నారు. ప్రాజెక్టులు పూర్తికాకుండానే ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. తెలంగాణ ప్రజలు తనపై ఐదేండ్లు పాటు నమ్మకం ఉంచండన్నారు. తెలంగాణ మహిళల పాద దూళిని ప్రసాదంగా స్వీకరిస్తానన్నారు. కొవిడ్ సమయంలో పసుపు ఎంతో మందిని కొవిడ్ నుంచి విముక్తి చేసిందన్నారు. అన్ని బూత్ లల్లో గెలవాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. ప్రతి బూత్ లో ప్రజల మనస్సు గెలవండన్నారు. ఇంటింటికి కమలం చేరుతుందని (కమల్ హర్ ఘర్ పహుంచే) అన్నారు.

You may also like

Leave a Comment