Telugu News » Amit Shah: అమిత్ షాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ…!

Amit Shah: అమిత్ షాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ…!

పేదలకు మెరుగైన నాణ్యమైన జీవనాన్ని అందించాలని ఆయన ఆలోచిస్తూ ఉంటారని అన్నారు.

by Ramu

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)కు ప్రధాని మోడీ (PM MOdi) పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపారు. దేశ పురోగతిపై అమిత్ షాకు మక్కువ ఉందని తెలిపారు. పేదలకు మెరుగైన నాణ్యమైన జీవనాన్ని అందించాలని ఆయన ఆలోచిస్తూ ఉంటారని అన్నారు. బీజేపీలో అమిత్ షా పాత్రను ప్రధాని మోడీ ఈ సందర్బంగా ప్రశంసించారు.

దేశ భద్రతా యంత్రాంగాన్ని మెరుగుపరచడంలో, సహకార రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంలో గొప్ప సహకారం అందించి, అత్యుత్తమ అడ్మినిస్ట్రేటర్‌గా అమిత్ షా పేరు పొందారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బీజేపీని బలోపేతం చేయడంలో అమిత్ షా పాత్ర అభినందనీయమన్నారు.

అమిత్ షా దీర్ఘా దీర్ఘ ఆయుష్షుతో, మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రధాని మోడీ కోరుకున్నారు. ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత అంతర్గత భద్రతలో అత్యంత సమర్థవంతమైన పాత్రను అమిత్ షా పోషిస్తున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

కృషి, దృఢ సంకల్పంతో దేశ, సమాజ పురోగమనానికి అమిత్ షా విశేషమైన కృషి చేస్తున్నాడని రాజ్ నాథ్ కొనియాడారు. దేవుడు ఆయన్ని ఆరోగ్యంగా ఉంచి, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని రాజ్ నాథ్ కోరుకున్నారు. మరోైవపు అసోం సీఎం కూడా అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత కఠినమైన జాతీయ వాది అని అమిత్ షాను ఆయన సంభోదించారు. సమకాలీన భారత్‌లో అత్యంత తెలివైన నాయకుల్లో ఒకరని అమిత్ షాను ఆయన కొనియాడారు.

You may also like

Leave a Comment