Telugu News » Rahul Gandhi : ప్రధాని మోడీ ఓబీసీ కాదు… రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు….!

Rahul Gandhi : ప్రధాని మోడీ ఓబీసీ కాదు… రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు….!

ప్రధాని మోడీ ఓబీసీ వర్గానికి చెందిన వారు కాదని ఆరోపించారు. ప్రధాని మోడీ జనరల్ కేటగిరికి చెందిన వారని వ్యాఖ్యలు చేశారు.

by Ramu
PM Modi lying isnt OBC by birth Heres how I know Rahul Gandhi returns fire

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ (PM Modi) ఆయన కులం గురించి అసత్యాలు చెబుతున్నారని అన్నారు. ప్రధాని మోడీ ఓబీసీ వర్గానికి చెందిన వారు కాదని ఆరోపించారు. ప్రధాని మోడీ జనరల్ కేటగిరికి చెందిన వారని వ్యాఖ్యలు చేశారు.

PM Modi lying isnt OBC by birth Heres how I know Rahul Gandhi returns fire

ఒడిశాలోని ఝార్సుగూడలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ…… గుజ‌రాత్‌లోని తేలి కులంలో ప్రధాని మోడీ జన్మించారని, ఆయన ఓబీసీ కులానికి చెందిన వారు కాదని తెలిపారు. ఈ సంఘానికి 2000 సంవత్సరంలో బీజేపీ ఓబీసీ ట్యాగ్ ఇచ్చిందని చెప్పారు.

ఆయన సాధారణ కులంలో జన్మించారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఓబీసీలో పుట్ట లేదని, సాధారణ కులంలో పుట్టారన్న కారణంగానే ప్రధాని మోడీ తన జీవితాంతం కుల గణనను నిర్వహించేందుకు అనుమతించడం లేదని అన్నారు.

ఇది ఇలా వుంటే భారత్ జోడో న్యాయ యాత్ర గురువారం ఛత్తీస్ గఢ్ కు చేరుకోనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత రాహుల్ గాంధీ చత్తీస్ గడ్ కు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 14న భారత్ జోడో న్యాయ యాత్ర బ‌ల్‌రాంపూర్ నుంచి జార్ఖండ్‌లోకి ప్ర‌వేశిస్తుంది.

You may also like

Leave a Comment