Telugu News » PM Modi: టీఎంసీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు: ప్రధాని మోడీ

PM Modi: టీఎంసీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు: ప్రధాని మోడీ

తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress) ప్రభుత్వంలో మహిళల (women’s) కు రక్షణ లేదని ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అన్నారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు బుధవారం ప్రధాని పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో పర్యటించారు.

by Mano
PM Modi: No protection for women in TMC government: PM Modi

తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress) ప్రభుత్వంలో మహిళల (women’s) కు రక్షణ లేదని ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అన్నారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు బుధవారం ప్రధాని పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో పర్యటించారు. సందేశ్‌ఖాలీ (Sandeshkhali) లోక్‌సభ నియోజకవర్గంలో గల బరాసత్‌లోని బహిరంగ సభలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi: No protection for women in TMC government: PM Modi

బెంగాల్లోని టీఎంసీ ప్రభుత్వం మహిళలకు ఎప్పటికీ రక్షణ కల్పించదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సందేశ్ఖాలీలో దారుణాలకు కారకుడైన వ్యక్తిని టీఎంసీ ప్రభుత్వం రక్షించేందుకు ప్రయత్నిస్తోందని వెల్లడించారు. నిరుపేద, దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన సోదరీమణులు, కూతుళ్లపై టీఎంసీ నేతలు పలు ప్రాంతాల్లో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్‌లోని మహిళలు సందేశ్ఖాలీ దారుణాలపై ఆగ్రహంతో ఉన్నారని ప్రధాని తెలిపారు.

అయితే, సందేశ్‌ఖాలీ తుపాను బెంగాల్‌లోని ప్రతి ప్రాంతానికీ చేరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అధికార టీఎంసీని నాశనం చేయడంలో మహిళా శక్తి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన దారుణాలు సిగ్గుచేటని ప్రధాని మండిపడ్డారు. మహిళా సాధికారత, వారి భద్రతకు మోడీ హామీ అని పేర్కొన్నారు.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారం వస్తుందని గ్రహించిన ఇండియా కూటమి నాయకుల్లో వణుకు మొదలైందని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. తనకు ఏ సమస్య వచ్చినా.. సోదరీమణులు, తల్లులు తన చుట్టూ రక్షణ కవచంలా నిలుస్తారని చెప్పారు. ప్రతిపక్ష నేతలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను.. ఈ దేశ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే. నా దగ్గర డబ్బులేనప్పుడు ప్రజలు నన్ను ఆదుకున్నారు. ఈ దేశంలోని ప్రతి పౌరుడితో నాకు కుటుంబ సంబంధాలు ఉన్నాయని మోడీ వెల్లడించారు.

You may also like

Leave a Comment