Telugu News » Trichy Airport : ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తిరుచ్చి ఎయిర్ పోర్ట్ టెర్మినల్ భవనం…!

Trichy Airport : ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తిరుచ్చి ఎయిర్ పోర్ట్ టెర్మినల్ భవనం…!

రాష్ట్రంలో చెన్నై తర్వాత రెండవ అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం తిరుచ్చి ఎయిర్ పోర్టు కావడం విశేషం.

by Ramu
PM Modi opens new Trichy airport terminal

తమిళనాడు తిరుచిరపల్లి ( Tiruchirappalli)లో అభివృద్ధి చేసిన ఎయిర్ పోర్టు టెర్మినల్ ( Airport Terminal Building)ను ప్రధాని మోడీ (PM Modi) మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రంలో చెన్నై తర్వాత రెండవ అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం తిరుచ్చి ఎయిర్ పోర్టు కావడం విశేషం.

PM Modi opens new Trichy airport terminal

ఈ విమానాశ్రయంలో అధ్యాత్మికత ఉట్టిపడుతోంది. ప్రయాణికులకు ఆలయ గోపురం ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఈ టర్మినల్ భవనాన్ని నిర్మించారు. ఇందులో మొత్తం 60 చెక్ ఇన్ కౌంటర్లు ఉన్నాయి. 5 లగేజీ చెకింగ్ కౌంటర్లు, 60 ఇమిగ్రేషన్ కౌంటర్లు, 44 డిపార్చర్​ ఇమ్మిగ్రేషన్​ కౌంటర్లను ఏర్పాటు చేశారు.

ఈ టెర్మినల్‌లో తాము చాలా పెయింటింగ్ వర్క్స్, మురల్స్ (కుడ్య చిత్రాలు) వేయించినట్టు టెర్మినల్ ఆర్ట్ వర్క్ క్రియేటివ్ డైరెక్టర్ రాజా విఘ్నేశ్ తెలిపారు. మొత్తం 100 మంది కళాకారులు ఈ పెయింటింగ్స్ వేశారన్నారు. తిరుచిరాపల్లికి చెందిన సాంస్కృతిక చైతన్యం నుంచి ప్రేరణ పొంది ఈ నూతన భవనాన్ని డిజైన్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.

ఈ నూతన టెర్మినల్ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిని పెంచుతుందని అధికారులు చెబుతున్నారు. మెరుగైన కనెక్టివిటీతో విమాన ప్రయాణాన్ని మెరుగు పరచడంలో దోహదపడుతుందని చెబుతున్నారు. రూ. 1100 కోట్లు ఖర్చు చేసి ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఈ టెర్మినల్​ ద్వారా ఏటా 44 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని పీఎంవో కార్యాలయం తెలిపింది.

You may also like

Leave a Comment