Telugu News » PM Modi: రాజ్యాంగ వ్యతిరేకులకు ఈ ఎన్నికల్లోనే శిక్ష.. ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

PM Modi: రాజ్యాంగ వ్యతిరేకులకు ఈ ఎన్నికల్లోనే శిక్ష.. ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఈ ఎన్నికలు రాజ్యాంగ వ్యతిరేకులను శిక్షిస్తాయని ప్రధాని మోడీ (PM Modi) పేర్కొన్నారు. ఇవాళ(మంగళవారం) బీహార్‌(Bihar)లోని గయలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. దేశాన్ని 'వికసిత భారత్'(Developed India)గా మార్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొందరు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

by Mano
PM Modi: Those who oppose the Constitution will be punished in this election.. Prime Minister Modi's interesting comments..!

ఈ ఎన్నికలు రాజ్యాంగ వ్యతిరేకులను శిక్షిస్తాయని ప్రధాని మోడీ (PM Modi) పేర్కొన్నారు. ఇవాళ(మంగళవారం) బీహార్‌(Bihar)లోని గయలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. దేశాన్ని ‘వికసిత భారత్'(Developed India)గా మార్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొందరు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

PM Modi: Those who oppose the Constitution will be punished in this election.. Prime Minister Modi's interesting comments..!

 

 

ర్యాలీలో పాల్గొనడానికి ముందు ప్రధాని మోడీ (ఎక్స్)లో పోస్టు చేశారు. “ప్రజాస్వామ్యానికి మాతృభూమి అయిన బీహార్.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమికి అపూర్వమైన విజయాన్ని అందించాలని కోరారు. ‘‘ఇవాళ మరోసారి, నా కుటుంబసభ్యులను కలిసే అవకాశం లభించింది. గయ, పూర్ణియాలో జరిగే బహిరంగ సభలో నేను బీహార్ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలను అందుకుంటాను.” అని మోడీ పేర్కొన్నారు.

అదేవిధంగా ఈ ఎన్నికలు ‘వికసిత భారత్’, ‘వికసిత బిహార్’ కోసమని ప్రధాని తెలిపారు. ఆర్జేడీ అవినీతికి ప్రతీక అని మోడీ విమర్శించారు. వారి పాలనలో అవినీతి పరిశ్రమలా అభివృద్ధి చెందిందని ఎద్దేవా చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లు సామాజిక న్యాయం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని శిక్షించేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.

ఆర్జేడీ, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు రాజ్యాంగం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, అసత్యాలకు పాల్పడుతున్నారని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఎం) వ్యవస్థాపకుడు జితన్ రామ్ మాంఝ గయా నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

You may also like

Leave a Comment