Telugu News » Uttarakhand : మనదేశ సరిహద్దు మూసివేస్తున్న అధికారులు.. కారణం ఇదే..!

Uttarakhand : మనదేశ సరిహద్దు మూసివేస్తున్న అధికారులు.. కారణం ఇదే..!

న్నికలు సజావుగా సాగేలా ఈసీ చర్యలు చేపట్టింది.. ఇదే క్రమంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అనేక రకాల కొత్త రూల్స్ అమలవుతున్నాయి..

by Venu
LokSabha Elections 2024

ప్రస్తుతం దేశంలో ఎన్నికల హవా నడుస్తుంది. ఈ ఎన్నికలను పార్టీలతో పాటు.. ఈసీ (EC) సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలు శ్రమిస్తుండగా.. ఎలాంటి వాంఛనీయ సంఘటన జరగకుండా.. ఎన్నికలు సజావుగా సాగేలా ఈసీ చర్యలు చేపట్టింది.. ఇదే క్రమంలో ఎన్నికల కోడ్ (Election Code) అమలులో ఉన్న సమయంలో అనేక రకాల కొత్త రూల్స్ అమలవుతున్నాయి..

మరోవైపు ఎన్నికలలో భాగంగా అన్ని రాష్ట్రాల పోలీసులతో పాటు, కేంద్ర బలగాలు కూడా గట్టి బందోబస్తులను ఏర్పాటు చేస్తున్నాయి. ఇక ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఏప్రిల్ 19న లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు భద్రత కారణాల దృష్ట్యా నేపాల్-ఉత్తరాఖండ్ సరిహద్దులను మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి రానున్న 72 గంటల పాటు మూసివేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం ఎస్‌ఎస్‌బీ సిబ్బందిని సరిహద్దుల్లో నియమించారు. ఏప్రిల్ 16 సాయంత్రం 5 గంటల నుంచి ఏప్రిల్ 19 సాయంత్రం 5 గంటల వరకు భారత్-నేపాల్ (Nepal) దేశాల మధ్య సరిహద్దులను మూసివేస్తున్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.. అదేవిధంగా ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే సరిహద్దులు ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు.. ఈ సమయంలో ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఇరుదేశాల మధ్య ప్రయాణం చేసేందుకు ఆర్మీ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు..

You may also like

Leave a Comment