ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అనుసరిస్తున్న విధానంపై బీఆర్ఎస్ (BRS) నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.. ముఖ్య నాయకులంతా ఇప్పటికే సగం ఖాళీ అయ్యారు. ఇక మిగిలి ఉన్న నేతలు.. వలస వెళ్తున్న నేతలపై దుమ్మెత్తి పోస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీపై, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు.. ఈ రెండు పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.

పదవులు, అధికారం, వ్యాపారాల కోసం వచ్చిన స్వార్ధపరులు, మోసకారులే పార్టీ మారుతున్నారని ఆరోపించిన పోచారం.. బీబీ పాటిల్ (Bibi Patil) పెద్ద మోసకారని విమర్శించారు.. మొదటి నుంచి గులాబీ జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు మాత్రమే పార్టీలో మిగిలారాని పేర్కొన్నారు.. కేంద్రంలో బీజేపీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమి లేదని మండిపడ్డారు..
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ (BJP)కి దిమ్మ తిరిగేలా ఓట్లు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.. కాంగ్రెస్ మోసం తెలిసిపోయిందని ఆరోపించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy).. మోస పూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.. వారి పాపం పండే రోజు ఎంతో దూరంలో లేదని జోస్యం చెప్పారు..