Telugu News » Hyderabad : క్రిటికల్ గా మారుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు.. చంచల్ గూడ జైలుకు రాధాకిషన్‌ రావు..!

Hyderabad : క్రిటికల్ గా మారుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు.. చంచల్ గూడ జైలుకు రాధాకిషన్‌ రావు..!

. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా, ఉద్యోగ విరమణ చేసిన అనంతరం.. ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

by Venu

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone tapping)కేసులో కీలక ఘటన చోటుచేసుకొంది. అధికారికంగా ట్యాపింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్‌ (Telegraph Act)ను జత పరుస్తూ నాంపల్లి (Nampally) కోర్టులో మెమో దాఖలు చేశారు.. కాగా దేశంలోనే టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు అవడం ఇదే తొలిసారి..

మరోవైపు దేశంలో అతి తక్కువ కేసుల్లోనే ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ ని ప్రయోగించారు. ఇక ఇప్పటి వరకు అధికార దుర్వినియోగం, ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసుల్లోనే నిందితులు ప్రణీత్, తిరుపతన్న, భుజంగరావును విచారించారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్

కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జుడిషియల్ రిమాండ్‌ విధించింది.
అనంతరం ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా, ఉద్యోగ విరమణ చేసిన అనంతరం.. ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అదీగాక ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను సైతం ఐదు రో

You may also like

Leave a Comment