– ఆత్మకూరులో రౌడీ గ్యాంగ్
– ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి
– అయ్యప్ప మాలలో ఉన్నా కూడా..
– దాడికి పాల్పడ్డ రౌడీమూక
– పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో..
– ఆత్మహత్యకు పాల్పడ్డ బాధితుడు
– నిందితులు షబ్బీర్, మున్నా, మునాఫ్, ఫరూఖ్ గా గుర్తింపు
– దాడి దృశ్యాలు వైరల్
ఏపీలో పోలీసులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. అన్యాయం జరిగినప్పుడు రక్షిస్తారని పోలీస్ స్టేషన్ కు వెళ్తే వారి నిజస్వరూపమేంటో చూపిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. న్యాయం వైపు నిలబడకుండా ఖాకీ డ్రెస్సుకు మాయని మచ్చను తెస్తున్నారని.. తాజాగా ఓ అయ్యప్ప మాలధారుడిపై మూకుమ్మడి దాడి ఘటనతో మరోసారి రుజువైందని అంతా అనుకుంటున్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వినయ్ అనే యువకుడు.. ఆత్మకూరు పట్టణంలోని తన పిన్ని వద్ద ఉంటూ బైక్ మెకానిక్ షాప్ లో గత రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. అయితే.. వినయ్ తన మిత్రుడు వంశీతో కలిసి ఆత్మకూరులో ఉండగా రౌడీ మూకలు విచక్షణారహితంగా దాడి చేశాయి. ఈ దాడి సమయంలో అక్కడే ఉండి కూడా కనీసం పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదనే విమర్శలు ఉన్నాయి.
బాధితులు పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశారు. అయినా కూడా, న్యాయం వైపు ఉండకుండా రౌడీ మూకకు మద్దతుగా నిలిచారని బాధుతుల కుటుంబసభ్యులు చెబుతున్నారు. అంతటితో ఆగకుండా బాధితులనే పోలీస్ స్టేషన్ కు తరలించి వేధింపులకు పాల్పడ్డారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన వినయ్.. అయ్యప్ప మాలధారణలో ఉన్నా కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల తీరు, న్యాయం జరగకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. దీంతో నిందితులు షబ్బీర్, మున్నా, మునాఫ్, ఫరూఖ్ పై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములు ఆందోళన చేశారు. స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అయ్యప్ప మాలలో ఉన్నా కూడా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ రౌడీ మూకపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.