Telugu News » Ponguleti : పొంగులేటి ఇళ్ల పై.. ఐటీ దాడుల వెనక ఉన్న హస్తం ఎవరిది..?

Ponguleti : పొంగులేటి ఇళ్ల పై.. ఐటీ దాడుల వెనక ఉన్న హస్తం ఎవరిది..?

కాంగ్రెస్ (Congress) ప్రచార కమిటీ కో- ఛైర్మన్.. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి.. మాజీ ఎంపీ (EX MP) పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivas Reddy)రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్​లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్‌ 10లో.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 17లో ఉన్న ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు..

by Venu

తెలంగాణ (Telangana)లో ఎన్నికలు అతి సమీపంలో ఉన్న విషయం తెలిసిందే.. ఈ సమయంలో ఎన్నికల ప్రచారంలో నేతలందరు బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు సోదాలు నిర్వహించడంలో ఐటీ అధికారులు కూడా ఊపిరాడకుండా విధులు నిర్వహిస్తున్నారు.. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల నివాసంలో ఐటీ రైడ్స్ జరుగుతున్న వార్తలు క్షణం తీరిక లేకుండా రావడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) ప్రచార కమిటీ కో- ఛైర్మన్.. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి.. మాజీ ఎంపీ (EX MP) పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivas Reddy) రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు రెండు రోజులు జరిగాయి. హైదరాబాద్​లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్‌ 10లో.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 17లో ఉన్న ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు.. ఈ సోదాలలో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం..

మరోవైపు ఐటీ దాడుల నేపథ్యంలో ఖమ్మం లో ఉన్న పొంగులేటి కుటుంబ సభ్యులు హైదరాబాద్​ చేరుకున్నారు.. కాగా వారి నుంచి పలు వివరాలు ఐటీ అధికారులు సేకరిస్తున్నట్టు సమాచారం. ఐటీ అధికారుల బృందం గురువారం రోజున.. ఏకకాలంలో ఆయన నివాసాలు, సంస్థల కార్యాలయాలపై మూకుమ్మడి సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. అందరి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు పొంగులేటికి సంబంధించిన అన్ని ఇళ్ళల్లో, గదుల్లో తనిఖీలు చేపట్టి ఐటీ రిటర్న్‌కు సంబంధించిన పత్రాలు, పలు డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలుస్తుంది.

ఈ మేరకు రాఘవా కన్స్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లపై పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఇలా మొత్తం 36 గంటల పాటు ఐటీ అధికారులు తనిఖీలు చేసి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటుగా మూడు బ్యాగులు, ఒక భ్రీఫ్ కేస్, ప్రింటర్, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో వాటిని తరలించారు.

ఈ ఐటీ దాడుల పై స్పందించిన పొంగులేటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి తనపై కుట్ర పన్నాయని.. ఉద్దేశపూర్వకంగా తనపై ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ (BJP)లో చేరలేదని.. బీఆర్ఎస్ (BRS) నుంచి విడిపోయానని.. కక్ష కట్టిన రెండు పార్టీలు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు పొంగులేటి ఆరోపణలు చేశారు..

You may also like

Leave a Comment