హైదరాబాద్(Hyderabad) మెట్రో(Metro) విస్తరణపై సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్పోర్ట్(Shamshabad Airport) మెట్రో అలైన్మెంట్ను మారుస్తున్నట్లు ప్రకటించారు. రాయదుర్గం నుంచి కాకుండా హైదరాబాద్ పాతబస్తీ నుంచి విమానాశ్రయం వరకు మెట్రోను పొడిగించాలని ఆదేశాలు జారీ చేశారు.
సీఎం ఆదేశాల మేరకు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కి.మీ. చాంద్రాయణగుట్ట వరకు మరో 1.5 కి.మీ. పొడిగిస్తే విమానాశ్రయం మెట్రోకు అనుసంధానం అవుతుంది. చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ ఇంటర్చేంజ్ స్టేషన్ రాబోతోంది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు రెండో దశ కొత్త రూట్ల ప్రతిపాదనలపై మెట్రో అధికారులు, నిపుణులు సమీక్ష నిర్వహించారు.
ఇరుకైన రోడ్లు, ఫ్లై ఓవర్ల కారణంగా మెట్రోరైల్ రివర్సల్, స్టేబుల్ లైన్ల పరిమితులు, సాధ్యమయ్యే సాంకేతిక పరిష్కారాలపై అధికారులు చర్చించారు. హెచ్ఐఎంఎల్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు. ప్రస్తుతం నాగోల్-ఎల్బీనగర్-మైలారేవల్లి-శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రూట్ కోసం ప్రతిపాదన ఉంది.
అదేవిధంగా నాగోల్-ఎల్బీనగర్-మైలార్వేపల్లి-అరంగార్-న్యూ హైకోర్టును కలిపే మరో మార్గం ఉంది. ఈ సమావేశంలో, నిపుణులు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? ఎలా చేయాలి? ప్రతిపాదిత కొత్త రూట్ల సవాళ్లు, పరిమితులు, సాంకేతిక పరిష్కారాలపై అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది.