Telugu News » Ayodhya Ram mandir : రామ మందిర ‘నైట్ వ్యూ’ ఇమేజెస్ చూశారా…. ఎంత అద్భుతంగా ఉన్నాయో….!

Ayodhya Ram mandir : రామ మందిర ‘నైట్ వ్యూ’ ఇమేజెస్ చూశారా…. ఎంత అద్భుతంగా ఉన్నాయో….!

మర్యాద పురుషోత్తముడు శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను కన్నులారా వీక్షించే తరించాలని అంతా ఉవ్విళ్లూరుతున్నారు.

by Ramu

– రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
– రాత్రి సమయంలో మెరిసిపోతున్న ఆలయం
– ప్రత్యేక వీడియో విడుదల చేసిన ట్రస్ట్

అయోధ్య (Ayodhy)లో ఈనెల 22న ‘రామ్ లల్లా’ (Ram Lalla) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మర్యాద పురుషోత్తముడు శ్రీ రాముడి కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించి తరించాలని అంతా ఉవ్విళ్లూరుతున్నారు.

ఇక రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆలయాన్ని, నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చి దిద్దుతున్నారు.  తాజాగా రామ మందిరం నైట్ వ్యూ వీడియోను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ షేర్ చేసింది. రాత్రి సమయంలోనూ ఆలయం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆలయ నిర్మాణంలో మొదటి దశ పూర్తి అయింది. 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో సంప్రోక్షణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి.

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి హిందూ నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన 7వేల మందిని ఆహ్వానించారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఆలయంలో మొదటి, రెండవ అంతస్తుల నిర్మాణం పూర్తి అవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.

రామ మందిరాన్ని నాగర శైలిలో నిర్మించారు. 2500 ఏండ్లు నిలిచి ఉండేలా అద్భుతంగా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణాన్ని చేస్తున్నారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద హిందూ ఆలయం ఇదే. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం అయోధ్య రామ మందిరం.

You may also like

Leave a Comment