Telugu News » Ponnam Prabhakar: దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయమా?: మంత్రి పొన్నం

Ponnam Prabhakar: దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయమా?: మంత్రి పొన్నం

వేములవాడ రాజరాజేశ్వర స్వామి(Rajanna temple)ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam) కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.

by Mano
Ponnam Prabhakar: Politics by blocking the gods?: Minister Ponnam

 దేశంలో దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడమేంటని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam) ప్రశ్నించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి(Rajanna temple)ని ఆయన కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.

Ponnam Prabhakar: Politics by blocking the gods?: Minister Ponnam

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో దేవుడిని కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలో దేవుడిని వినియోగించుకోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. దేవుడు వారికే సొంతం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతి లింగాలు, నాలుగు వేదాలు, నలుగురు జగద్గురులు ఉన్నారని తెలిపారు. వాళ్ల చేతుల మీదుగా రామాలయం విగ్రహ ప్రతిష్ఠాపన చేయాల్సి ఉండగా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగిస్తున్నారంటూ విమర్శించారు..

పవిత్ర భారత దేశంలో రాజకీయాల్లో దేవుళ్లను అడ్డం పెట్టుకొని మార్కెటింగ్ చేస్తున్నారని మంత్రి పొన్నం ఆరోపించారు. ప్రశ్నిస్తే తాము హిందువులకు వ్యతిరేకం అంటున్నారని తెలిపారు. హిందుత్వాన్ని విశ్వసించే ఆలోచించాలన్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కాలేదని జగద్గురువులు చెబుతున్నా వారి మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు.

అయితే, ఆనాడు రాజీవ్ గాంధీనే రాముడి చరిత్ర వెలికి తీశారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ గుర్తు చేశారు. పార్లమెంట్‌లో అంబానీ, అదానీ గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు. వేములవాడ అభివృద్ధిపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రాజన్న ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment