Telugu News » Bandi Sanjay : రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్‌ను అప్రమత్తం చేయాలి.. హెచ్చరించిన బండి సంజయ్..!!

Bandi Sanjay : రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్‌ను అప్రమత్తం చేయాలి.. హెచ్చరించిన బండి సంజయ్..!!

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని సూచించారు.. యాదాద్రి పున:నిర్మాణం ముసుగులో భారీ రియల్ ఏస్టేట్ వ్యాపారం జరిగిందని ఆరోపించిన బండి సంజయ్.. కేసీఆర్‌ చేసినట్టు అయోధ్యలో ప్రధాని మోడీ భూములు కొనుగోలు చేయలేదని ఎద్దేవా చేశారు.

by Venu
bandi sanjay fire on rahul gandhi

రాష్ట్రంలో కాంగ్రెస్‌ (Congress) సర్కార్‌ను కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఊపందుకొన్నాయి.. ఈ విషయంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు.. ఆ పార్టీ నేతల మాటలు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నట్టు అనుకొంటున్నారు.. ఈ క్రమంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు..

6 Gaurentees should also implement to new ration Card applicants says bandi sanjay

నేడు భోగి వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ (Bandi Sanjay).. బీఆర్ఎస్ (BRS) రాజకీయ కుట్రలకు ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.. కేసీఆర్‌ (KCR)తో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బాంబ్ పేల్చారు. అధికారం కోల్పోయి తీవ్ర అసహనంలో ఉన్న కేసీఆర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని షాకిచ్చారు..

తెలంగాణ (Telangana)లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏవైనా జరుగొచ్చని బండి జోష్యం చెప్పారు.. ప్రజాస్వామ్యంపై నమ్మకం, గౌరవం లేవని కేసీఆర్‌.. కుట్రలకు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్‌ను అప్రమత్తం చేయాలని హెచ్చరించారు. బీఆర్ఎస్, బీజేపీ (BJP) ఒక్కటే అని వస్తున్న ఆరోపణలు ఖండించారు..

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని సూచించారు.. యాదాద్రి పున:నిర్మాణం ముసుగులో భారీ రియల్ ఏస్టేట్ వ్యాపారం జరిగిందని ఆరోపించిన బండి సంజయ్.. కేసీఆర్‌ చేసినట్టు అయోధ్యలో ప్రధాని మోడీ భూములు కొనుగోలు చేయలేదని ఎద్దేవా చేశారు. అవినీతి మరక లేని మోడీ.. నిండా అవినీతిలో మునిగిన కేసీఆర్ వీరిద్దరికి అసలు పోలిక లేదని పేర్కొన్నారు..

You may also like

Leave a Comment