రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్పందించారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువంటూ బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ప్రాజెక్టులోపై మీరు ఎప్పుడు చర్చకు రమ్మన్న రావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మీరు అధికారం నుంచి దిగేనాటికి ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత నీటి నిల్వలుపై చర్చిద్దామన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. భూగర్భ జలాలు అడుగంటాయన్నారు. రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమన్నారు. ప్రాజెక్టులోపై ఎప్పుడు చర్చకు రమ్మన్నా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గీతన్న, నేతన్న వీరే కాదని వారికి కవచలంగా ఉండే బాధ్యత తనదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
అసెంబ్లీలో చర్చకు రాని మాజీ సీఎం కేసీఆర్ పొలాల సొందర్శనకు బయల్దేరారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం తరఫున పంటలకు ఇబ్బంది ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. కరువుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కారణం కాదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రాజకీయంగా బీజేపీతో లేకుంటే, రైతుల ప్రయోజనాలను కాపాడినట్లైతే తమతో పాటు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కలిసి రావాలని కోరారు.
బీజేపీ సభ్యుడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడని, మొసలి కన్నీరు కారుస్తూ దీక్షలు చేస్తున్నాడని మండిపడ్డారు. మోడీ తెలంగాణ విభజన హామీలు అమలు చేయలేదని, తెలంగాణ రైతన్న ఆదుకునే ప్రయత్నమూ చేయలేదని, తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదని తెలిపారు. ఆ ప్రాజెక్టును అడిగే ధైర్యమూ బీఆర్ఎస్కు లేదన్నారు. తమకు కేంద్రంతో ఎలాంటి భేషజాలం లేదన్నారు. కేంద్రం సహకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
నేతన్నల మీద కాంగ్రెస్కు ఎందుకింత కక్ష అంటున్న మాజీ మంత్రి కేటీఆర్ మూడు నెలల్లో తామేం కక్ష చేశామో కేటీఆర్ చెప్పాలన్నారు. బతుకమ్మ చీరల పెండింగ్ డబ్బులను ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది ఎవరని ప్రశ్నించారు. 24×7 ఉపాధి ఉండే విధంగా టేస్కో ని పటిష్టం చేస్తూ రాష్ట్రంలో అవసరమున్న ప్రతీ నేతన్నల దగ్గర కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. పాత బకాయిలు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.