Telugu News » Prajapalana: ప్రతీ పేదవాడికి ‘గ్యారంటీ’లు చేరవేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

Prajapalana: ప్రతీ పేదవాడికి ‘గ్యారంటీ’లు చేరవేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రజాపాలన దరఖాస్తుల పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

by Mano
Prajapalana: We will provide 'guarantees' to every poor person: CM Revanth Reddy

ప్రతీ పేద వాడికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను చేరవేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రజాపాలన దరఖాస్తుల పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులందరూ దరఖాస్తులు పెట్టుకోవాలని సూచించారు.

Prajapalana: We will provide 'guarantees' to every poor person: CM Revanth Reddy

ప్రజావాణిలో వేల దరఖాస్తులు వచ్చాయన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇందులో ఎక్కువగా భూ సమస్యలే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వాన్నే ప్రజల వద్దకు తీసుకువెళ్లాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రతీ మండలంలో రెండు గ్రూపులుంటాయని, ఒకటి ఎండీవో, మరొకటి తహసీల్దార్ అని చెప్పారు. గ్రామసభల్లో మహిళలకు, పురుషులకు సపరేట్ కౌంటర్లు ఉంటాయని తెలిపారు. గ్రామసభల్లో దరఖాస్తు పెట్టుకోలేని వాళ్లు తహసీల్దార్, ఎంపీడీవో ఆఫీసుల్లో దరఖాస్తులు పెట్టుకోవాలని తెలిపారు.

అభయహస్తం దరఖాస్తులను డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు స్వీకరించనున్నారు. మహాలక్ష్మి ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకానికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించింది. అన్నింటికీ ఒక్కటే అప్లికేషన్ ప్రజా పాలనలో భాగంగా అర్హుల నుంచి తీసుకునే దరఖాస్తులో మొదటి పేజీలో కుటుంబ వివరాలతో పాటు ఇంటి యజమాని పేరు, క్యాస్ట్, పుట్టిన తేదీ, ఆధార్, రేషన్ కార్డు, వృత్తి వివరాలను తీసుకుంటారు.

మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కు గ్యాస్ సిలిండర్‌, రైతు భరోసా పథకం, గృహజ్యోతి, చేయూత పథకాలకు కేటగిరీల వారీగా వివరాలు తీసుకోనున్నారు. ప్రతీ అప్లికేషన్‌కు ఒక రసీదు ఇస్తారు. అందులో ఏ అధికారి అప్లికేషన్ తీసుకున్నారో ఆయన పేరు తీసుకోనున్నారు. ప్రతి అప్లికేషన్‌కు ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు కాపీలను జత చేయాల్సి ఉంటుంది.

You may also like

Leave a Comment