Telugu News » Prakasham barrage: బీ అలర్ట్.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద..!

Prakasham barrage: బీ అలర్ట్.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద..!

ఎన్టీఆర్ జిల్లా(NTR dist) వ్యాప్తంగా కురిసిన వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ(Prakasham barrage) కి వరద ఉధృతి పోటెత్తుతోంది.

by Mano
Prakasham barrage: Be alert.. Flood pouring into Prakasham barrage..!

కృష్ణా నది(Krishna River)కి వరద ప్రవాహం భారీగా పెరిగింది. గడిచిన కొన్ని రోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండంతో నదిలోనికి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. దీనికి తోడు ఎన్టీఆర్ జిల్లా(NTR dist) వ్యాప్తంగా కురిసిన వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Prakasham barrage: Be alert.. Flood pouring into Prakasham barrage..!

ప్రకాశం బ్యారేజీ(Prakasham barrage) కి వరద ఉధృతి పోటెత్తుతోంది. ఈ వరద నీరంత ప్రస్తుతం కృష్ణా నదిలోకి వచ్చి చేరడంతో నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను అధికారులు అలర్ట్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర 30 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర 12 అడుగుల నీటి మట్టం ఉంది.

ప్రకాశం బ్యారేజీ 72 గేట్లలోని 40 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి, మిగులు జలాలను కిందికి రిలీజ్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇన్ ఫ్లో 30 వేల క్యూసెక్కులు ఉంది. అవుట్ ఫ్లోలో కూడా 30 వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

You may also like

Leave a Comment