ప్రభుత్వాన్ని కూల్చి ఢిల్లీ (Delhi)లో రాష్ట్రపతి పాలన తీసుకురావడానికి బీజేపీ (BJP) కుట్రలు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి అతిషి (Minister Atishi) ఆరోపించారు.. లిక్కర్ కుంభకోణం పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎన్నికల ముందు పక్కా ప్లాన్ తో ఇదంతా జరుగుతున్నట్లు పేర్కొన్నారు.. దేశ రాజధానిలో ప్రభుత్వ అధికారులు సమావేశాలకు హాజరు కావడం మానేశారని పేర్కొన్నారు..
మరోవైపు సీఎం ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించిన అతిషి.. ఢిల్లీలో అధికారులను నియమించడం లేదు, బదిలీలు, పోస్టింగ్‌లు లేవని మండిపడ్డారు.. బీజేపీ గత కొన్ని రోజులుగా ఎల్‌జీ ఎంహెచ్‌ఏకు నిరాధారమైన లేఖలు రాస్తున్నారని విమర్శించారు. ఇవన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసినట్లుగా ఉందని తెలిపారు.. ఈ సంకేతాలన్ని చూస్తే ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వ్యాఖ్యానించారు.
ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రపతి పాలన “చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం” అని మంత్రి మండిపడ్డారు.. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని పేర్కొన్న ఆమె.. వారి ఆదేశానికి విరుద్ధంగా బీజేపీ ఆలోచనలున్నట్లు వెల్లడించారు.. ఇదిలా ఉండగా ఇటీవల సీఎం కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్‌ను, విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ తొలగించింది.
ఇంతలో మంత్రి అతిషి ఈ వ్యాఖ్యలు చేయడం హస్తినా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.. మరోవైపు జైల్లో ఉన్న క్రేజీవాల్ బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే.. ఈడీ.. సీబీఐ ఈ లిక్కర్ కేసులో ఉడుంపట్టు పట్టి ఇప్పటికే పలు సంచలన విషయాలు బయటపెట్టింది. ఇక లోక్ సభ ఎన్నికలు ముగిశాక మద్యం కుంభకోణం ఏ టర్నింగ్ తీసుకొంటుందో అనే ఆసక్తి రేకెత్తిస్తుంది..