Telugu News » PM Modi : దోచుకునే లైసెన్స్ వచ్చిందని భావించిన కాంగ్రెస్.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని..!

PM Modi : దోచుకునే లైసెన్స్ వచ్చిందని భావించిన కాంగ్రెస్.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని..!

దేశంలోని కోట్లాది ప్రజలు, నా తల్లులు, చెల్లెళ్లు నేడు నాకు రక్షణ కవచంగా మారారని పేర్కొన్నారు.. అలాగే గిరిజనులను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించిన మోడీ

by Venu
BJP has a clear majority in both phases. If Congress opposes Modi's decisions, it will be a disaster!

కాంగ్రెస్ హయాంలో అవినీతి దేశానికి గుర్తింపుగా మారిందని మోడీ మండిపడ్డారు.. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్​గఢ్​ (Chhattisgarh)లోని బస్తర్​ (Bastar)లో బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పేదల అవసరాలను కాంగ్రెస్​ (Congress) ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం కృషి వల్ల 25 కోట్ల మంది పేదలు దారిద్ర్య రేఖ ఎగువకు చేరారని పేర్కొన్నారు.

Prime Minister Modi's key comments on Hinduism.. Strong warning to those parties!కొవిడ్​ సమయంలో పేద ప్రజలు ఏమైపోతారోనని కేంద్ర ప్రభుత్వ పని తీరుపై అనుమాన పడ్డారు.. కానీ తాను వారికి ఉచిత రేషన్, వ్యాక్సిన్​ ఇచ్చి అండగా నిలిచినట్లు మోడీ (Modi) తెలిపారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వానికి మద్దతిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కోట్టాది మంది దేశ ప్రజలు, తల్లులు, సోదరీమణులు తనకు రక్షణ కవచం అయ్యారని వెల్లడించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తమకు దోచుకునే లైసెన్స్ వచ్చిందని కాంగ్రెస్ భావించిందని విమర్శించిన మోడీ.. 2014లో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దోచుకునే లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపారు. వారి లైసెన్సులు రద్దు చేయడానికి కారణం మీరు అని తెలిపిన ప్రధాని.. నాకు లైసెన్సు ఇవ్వడం వల్లనే నా దేశ సౌఖ్యం కోసం ఈ పనిచేశానని పేర్కొన్నారు.

మరోవైపు బీజేపీ (BJP) ప్రభత్వంలో పేదల ఖాతాల్లోకి రూ.34లక్షల కోట్లను జమ చేసినట్లు తెలిపిన మోడీ.. ఆ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరిందన్నారు. ఎప్పుడైతే నేరుగా డబ్బు లబ్ధిదారులకు చేరిందో అప్పుడే కాంగ్రెస్​కు దోచుకునే ఛాన్స్​ లేకుండా పోయిందన్నారు. ఇప్పుడు చెప్పండి వారి దుకాణం మూతపడి దోచుకునే లైసెన్సు పోయినందుకు నన్ను దుర్భాషలాడతారా లేదా? అని ప్రశ్నించారు..

కానీ దేశంలోని కోట్లాది ప్రజలు, నా తల్లులు, చెల్లెళ్లు నేడు నాకు రక్షణ కవచంగా మారారని పేర్కొన్నారు.. అలాగే గిరిజనులను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించిన మోడీ.. అదే గిరిజన బిడ్డ ఇప్పుడు దేశ తొలి గిరిజన రాష్ట్రపతి అయ్యారని తెలిపారు. ఛత్తీస్​గఢ్​కు బీజేపీ తొలి గిరిజన ముఖ్యమంత్రిని ఇచ్చిందని గుర్తుచేశారు. మరోవైపు గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపిన ప్రధాని.. గిరిజన సంక్షేమానికి గత పదేళ్లలో ఐదు రెట్లు బడ్జెట్‌ బీజేపీ పెంచిందని వివరించారు.

You may also like

Leave a Comment