Telugu News » PSLV-C58: ఇస్రో మరో ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ58

PSLV-C58: ఇస్రో మరో ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ58

అంతరిక్ష పీఎస్‌ఎల్వీ-సీ58(PSLV-C58) రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధావన్‌ రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి నిప్పులుచిమ్ముతూ రోదసీలోకి దూసుకెళ్లింది.

by Mano
PSLV-C58: Another achievement of ISRO..PSLV-C58 which crashed into Ningi

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో(ISRO) నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికింది. అంతరిక్ష పీఎస్‌ఎల్వీ-సీ58(PSLV-C58) రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధావన్‌ రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి నిప్పులుచిమ్ముతూ రోదసీలోకి దూసుకెళ్లింది. అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల (Black Hole) అధ్యయనమే ఈ ఉపగ్రహం లక్ష్యం.

PSLV-C58: Another achievement of ISRO..PSLV-C58 which crashed into Ningi

ఈ వాహకనౌక 21.5 నిమిషాల్లో నిర్ధేశిత కక్ష్యలోకి అత్యాధునిక ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. దీంతోపాటు మరో 10 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్తోంది. ఖగోళ శాస్త్రంలో సరికొత్త చరిత్రకు ఇస్రో నాంది పలుకబోతున్నది. ఇది భారత్‌ తొలి పొలారిమెట్రీ మిషన్‌ కాగా.. ప్రపంచంలో రెండోది.

ఐదేండ్లపాటు సేవలందించనున్న ఎక్స్‌పోశాట్‌లో రెండు పేలోడ్స్‌ ఉన్నాయి. పాలీఎక్స్‌ (ఎక్స్‌-కిరణాలలో పొలారిమీటర్‌ పరికరం), ఎక్స్‌-రే స్పెక్ట్రోసోపీ, టైమింగ్‌ (ఎక్స్‌పెక్ట్‌-ఎక్స్‌స్‌పీఈసీటీ)ను అమర్చారు. పాలీఎక్స్‌ను రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేయగా, ఎక్స్‌పెక్ట్‌ను యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌కు చెందిన స్పేస్‌ ఆస్ట్రానమీ గ్రూప్‌ రూపొందించింది.

ఇంతకు ముందు ఈ తరహా మిషన్‌ అమెరికా చేపట్టింది. సవాళ్లతో కూడుకున్న పల్సర్‌లు, బ్లాక్‌హోల్‌ ఎక్స్‌ రే బైనరీలు, యాక్టివ్‌ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్‌ స్టార్స్‌, నాన్‌ థర్మల్‌ సూపర్‌ నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్‌పోశాట్‌ అధ్యయనం చేయనున్నది. ఈ ఉపగ్రహాన్ని 500-700 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెడుతారు. ఈ ఉపగ్రహం ఖగోళ వస్తువులు, తోకచుకుల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని ఎక్స్‌పోశాట్‌ సేకరించనున్నది.

You may also like

Leave a Comment