Telugu News » Puppalaguda Lands : ఆ స్కామ్ 40 వేల కోట్లు.. నోరెత్తితే మామూళ్లు!

Puppalaguda Lands : ఆ స్కామ్ 40 వేల కోట్లు.. నోరెత్తితే మామూళ్లు!

ప్రభుత్వ భూములు అంటూ చెప్పుకున్న కస్టోడియల్ కాందిశీకుల భూములను ఖతం పట్టిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

by CDReddy
raashtra-special-story-on-puppalaguda-lands-scam

– పుప్పాలగూడ‌ భూముల్లో పుష్పరాజులు
– కాందిశీకుల భూములపై క‌న్ను
– తెలంగాణ ఏర్పడ్డాకే కాస్ట్లీ భూముల మాయం
– లింకు డాక్యుమెంట్ల పేరుతో రూ.40 వేల కోట్ల స్కాం!
– ఎవ‌రూ నోరెత్తకుండా మామూళ్లు
– ఎకరం వంద కోట్లు పలికే భూములు..
– అధికారుల సహ‌కారం.. ప్రభుత్వ పెద్దల పాత్రపై..
– “రాష్ట్ర” క్రైంబ్యూరో ఇక‌పై వ‌రుస క‌థ‌నాలు
– పుప్పాలగూడ‌.. దోపిడీకి అడ్డా- పార్ట్ 1

క్రైంబ్యూరో, రాష్ట్ర‌:హైదరాబాద్ (Hyderabad).. వేగంగా విస్త‌రిస్తున్న మ‌హాన‌గ‌రం. ఇక్క‌డి భూముల ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈమ‌ధ్య కోకాపేట (kokapet) ప్రభుత్వ భూముల్లో వేలం వేస్తే ఎకరం 100 కోట్లకు అమ్ముడు పోయింది. ప‌క్క‌నే ఉన్న పుప్పాలగూడ‌ (Puppalaguda)లో గత ఏడాది ఇదే తీరున‌ వేలం వేయాల‌ని చూస్తే కోర్టు (Court) స్టే విధించింది. ప్రభుత్వ భూములు అంటూ చెప్పుకున్న కస్టోడియల్ కాందిశీకుల భూములను ఖతం పట్టిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అసలైన టైటిల్ దారులు లేకుండానే వేల కోట్ల భూములు కొట్టేశార‌నే విమ‌ర్శ‌లు త‌ర‌చూ వినిపిస్తుంటాయి. తెలంగాణ రాష్ట్రం ( Telangana State) ఏర్పడినప్పటి నుంచి ఈ బరితెగింపు ఎక్కువైంద‌ని అంటుంటారు. 27 గజాల భూమి లింకు డాక్యుమెంట్ తో ఒకరు 200 ఎకరాలకు క్లియర్ చేసుకున్నారు. ఇందుకు హెచ్ఎండీఏ అనుమతులు కూడా ఇచ్చింది. నీకింత.. నాకింత అంటూ అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు పంచుకున్న‌ట్టు విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. మరొక‌రైతే చిక్కడపల్లిలోని 287 గజాల భూమిని లింకు డాక్యుమెంట్లతో 190 ఎకరాల‌ దోపిడీకి పాల్ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. మరి కొందరు రైతుల జీపీఏల పేర్లతో విస్తరణ లేకుండానే ధృవీక‌ర‌ణ‌ పేరుతో ఎకరాలకు ఎకరాలు కొట్టేస్తున్నార‌ని అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ భూములకు కస్టోడియల్ గా ఉండాల్సిన కలెక్టర్స్.. పైస‌ల‌కు ఆశ‌ప‌డి.. ఉన్న భూమిని ఊడ్చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో 20 గుంటలకు తక్కువ రిజిస్ట్రేషన్ చేయరాదు. కానీ, గండిపేట ఎమ్మార్వో రాజశేఖర్ మాత్రం అన్ని గుంటల్లోనే రిజిస్ట్రేషన్ కొనసాగించడంతో బ‌డాబాబులు రాత్రికి రాత్రే కోటీశ్వీరులు.. వేల కోట్లకు అధిపతులు అవుతున్నార‌ని వినికిడి.

raashtra-special-story-on-puppalaguda-lands-scam

పుప్పాలగూడ భూముల చరిత్ర ఇదే!

గండిపేట మండలం కోకాపేటకు ఆనుకుని ఉన్న పుప్పాలగూడ భూముల‌తో కొంద‌రికి బాగా కలిసి వచ్చింది. మూడు దశాబ్దాల క్రితం ఏదీ క్లియర్ చేయకపోవడంతో ఇప్పుడు భారీగా లబ్ది పొందుతున్నారు. దొంగ లింకు డాక్యుమెంట్లతో వేలకోట్లతో రాజ్యమేలుతున్నారు. దేశ విభజనలో ముస్లింలు పాకిస్తాన్ కి వెళ్లినప్పుడు వారి అస్తులను సరెండర్ చేస్తూ వెళ్లారు. తర్వాత వారు వచ్చినప్పుడు కేటాయించేలా ఎవెక్యూ ప్రాపర్టీ యాక్ట్ 1950(కాందిశీకులు) వచ్చింది. పుప్పాలగూడ‌లో ఫకిరియా జంగ్ ప్రాపర్టీ 1947లో సరెండర్ చేశారు. అయితే.. 272 సర్వే నెంబర్ నుంచి 345 సర్వే నెంబర్స్ వరకు ఉన్న 950 ఎకరాలు వివాదంలో చిక్కుకున్నాయి. అసలైన రైతులకు, లాంగ్ టర్మ్ పొజిషనల్ లో ఉండే వారికి నష్టం వాటిళ్ల‌డమే కాకుండా ప్రభుత్వ భూములను సైతం కాజేస్తున్నారు. తాజాగా హెచ్ఎండీఏ అనుమతుల పేరుతో భూ దాహం తీర్పుకుంటూ వేల కోట్లు వెనకేసుకుంటున్నారు.

raashtra-special-story-on-puppalaguda-lands-scam 1

ఇక‌పై “రాష్ట్ర” లో వ‌రుస క‌థ‌నాలు

పుప్పాలగూడ‌ పుష్పరాజులపై ఇక నుంచి “రాష్ట్ర” క్రైంబ్యూరో పక్కా ఆధారాలతో వరుస కథనాలు ఇవ్వ‌నుంది. అధికారుల అవినీతి, మంచిరేవుల భూములను కాపాడిన వారు.. పుప్పాలగూడ‌ భూముల్లో ఎంత సంపాదించారో ఎవిడెన్స్ తో పాటు స్టింగ్ ఆపరేషన్ ద్వారా స్పెషల్ స్టోరీలు ఇవ్వబోతోంది. ప్రజా స‌మ‌స్య‌ల‌పై పోరాటం.. అక్ర‌మార్కుల‌పై ఉక్కుపాదం మా నినాదం.

raashtra-special-story-on-puppalaguda-lands-scam 2

You may also like

Leave a Comment