ఈ ఎన్నికలు ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు నుంచి బయటకు తెచ్చే ఎన్నికలు కావని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి(Medak BJP MP Candidate) రఘునందన్‌రావు(Raghunandan Rao) అన్నారు. సిద్దిపేట జిల్లా(Siddipet District) నంగునూర్ మండలం కోనాయి పల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో రఘునందన్‌రావు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ.. తాను దుబ్బకలో ఓడిపోవడం ఎంత నిజమో కామారెడ్డిలో కేసీఆర్‌ను బీజేపీ వాళ్లు ఓడించిందీ అంతే నిజమన్నారు. తెలంగాణలో ఆడపిల్లలు లిక్కర్ దందా నడపరని తెలిపారు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్ కుటుంబంలోని వ్యక్తులు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.
39ఏళ్లుగా సిద్ధిపేట నుంచి కుటుంబపాలన మొదలైందన్నారు. 1985లో కేసీఆర్ మొదటిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే ఈ కుటుంబపాలన కొనసాగుతోందని ఆరోపించారు. కేసీఆర్ అంటే కాళేశ్వర రావు అంటారు కానీ నంగునూర్‌లోని ఒక్క చెరువులో నీళ్లు లేవని విమర్శించారు. హరీశ్‌రావు గట్టుపై నిలబడి ఎప్పుడు దాటాలా? అని చూస్తున్నాడంటూ తెలిపారు.
రూ.1600కోట్లతో సిద్దిపేట నుంచి ఎలకతుర్తి వరకు కేంద్ర నిధులతో రోడ్డు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రేవంత్ లంకె బిందెలున్నాయని అధికారంలోకి వచ్చాడా లేక ఖాళీ బిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చాడా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యే గెలిస్తే ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాణీ చేస్తానని నేటికీ చేయలేదన్నారు.
అదేవిధంగా అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా రూ.4వేల పింఛన్ ఇవ్వలేదంటూ దుయ్యబట్టారు. దేశం బాగుండాలంటే బీజేపీ గెలవాల్సిన అవసరముందని రఘునందన్ రావు అన్నారు. ఇంకా ఐదేళ్లలో ఉచిత రేషన్ బియ్యం అందిస్తామని చెప్పారు.దేశంలోని ఇస్లామిక్ తీవ్రవాదం పోవాలి అంటే,హిందూ మత రక్షణ జరగాలంటే నరేంద్ర మోడీ గెలవాలని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ కులం పేరుతో చేస్తున్న రాజకీయాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.