Telugu News » Lok Sabha Elections 2024: దేశంలో తొలి విడత పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..!

Lok Sabha Elections 2024: దేశంలో తొలి విడత పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..!

మొదటి విడతలో భాగంగా ఈరోజు(శుక్రవారం) 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి.

by Mano
Lok Sabha Elections 2024: The first round of polling in the country.. Celebrities who exercised their right to vote..!

దేశంలో తొలి విడత పోలింగ్(First round of polling) ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 44 రోజుల పాటు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి విషయం తెలిసిందే. మొదటి విడతలో భాగంగా ఈరోజు(శుక్రవారం) 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి.

Lok Sabha Elections 2024: The first round of polling in the country.. Celebrities who exercised their right to vote..!

తమిళనాడు(Tamil Nadu) లో ఒకే సారి అన్ని స్థానాలను పోలింగ్ జరుగుతోంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచి పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు క్యూలో నిలబడి ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో సూపర్ స్టార్ రజనీకాంత్(Super star Rajinikanth) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఆ సమయంలో అభిమానులు నినాదాలు చేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా తమిళనాడు సీఎం స్టాలిన్, తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై, సినీ నటులు కమలహాసన్, అజిత్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వీరితో పాటు తమిళనాడులోని శివగంగలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నాయకుడు పీ.చిదంబరం ఓటు వేశారు. సేలంలో తమిళనాడు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి, తిరుచిరాపల్లిలో మంత్రి కేఎన్ నెహ్రూ, ఉతుపట్టిలో కే.అన్నమళై, చెన్నెలోని సాలిగ్రామంలో తమిళిపై సౌందర రాజన్ తదితరులు తమ ఓటు వేశారు.

You may also like

Leave a Comment