Telugu News » Raghunandan Rao : రేవంత్ రెడ్డి కొడంగల్ ముఖ్యమంత్రినా..? తెలంగాణ సీఎంనా..?

Raghunandan Rao : రేవంత్ రెడ్డి కొడంగల్ ముఖ్యమంత్రినా..? తెలంగాణ సీఎంనా..?

ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి కానీ ఒక వారి సొంత నియోజక వర్గాలకు కాదనే విషయాన్ని విస్మరించిన గత సీఎం రాష్ట్రంలోని మిగతా గ్రామాల, పట్టణాల పట్ల అంతగా ఆసక్తి చూపకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

by Venu
raghunandan-rao

కొడంగల్‌కు నిధులపై ప్రతిపక్షాల కొట్లాట..

కేసీఆర్ బాటలోనే వెళ్తున్న రేవంత్..

సీఎం తీరు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమా..

పదవులు రాకముందు ఆశలు కలిపిస్తారు.. అధికారం రాగానే అన్ని మరచిపోతారు అనే విమర్శలు రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఇలాంటి చీకట్లే అలుముకోంటున్నాయని అనుకొంటున్నారు. ఒకప్పుడు కేసీఆర్ (KCR) పై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నన్ని రోజులు గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్లకే అభివృద్ధి పరిమితం అయింది..

Raghunandan Rao: 'This is proof of your perversion..' Raghunandan Rao fires on BRS..!

ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి కానీ ఒక వారి సొంత నియోజక వర్గాలకు కాదనే విషయాన్ని విస్మరించిన గత సీఎం రాష్ట్రంలోని మిగతా గ్రామాల, పట్టణాల పట్ల అంతగా ఆసక్తి చూపకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం ఇదే మార్గంలో వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. ఇందుకు కారణం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ (Kodangal)లో నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా రూ.4,329 కోట్లతో పనులకు శంకుస్థాపన చేయడం రాజకీయ విమర్శలకు దారితీసింది. ఒక్క తన నియోజక వర్గానికే ఇన్ని నిధులా అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇలా కొడంగల్‌లో భారీగా నిధులు కేటాయించటంపై బీజేపీ (BJP) నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి కొడంగల్ ముఖ్యమంత్రా..? తెలంగాణ ముఖ్యమంత్రా..? అని ప్రశ్నించారు.

గత ప్రభుత్వ హయాంలో నిధులన్నీ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కేనా అని అడిగిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కొడంగల్‌కు ఒక్క శంకుస్థాపనతో 4,329 కోట్లు కేటాయించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.. సీఎం వ్యవహారం చూస్తుంటే దొందు దొందే అన్నటు ఉందని ట్వీట్ చేశారు. సీఎం అయిన వారు వారి వారి నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకొంటూ వెళ్ళితే.. మిగతా నియోజక వర్గాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ తీరుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే యుగాలు పడుతుందని విమర్శించారు.

మరోవైపు రఘునందన్ రావు ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తున్న విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. మీరు ఉత్తర భారత దేశానికే ప్రధాన మంత్రినా… దక్షిణ భారత దేశానికి కాదా ? అనే ప్రశ్న ప్రధానిని అడగండని మరికొందరు మండిపడుతున్నారు. పక్క వారు బాగులేరని విమర్శించే ముందు.. మనం ఎలా ఉన్నాం అనే దాని గురించి కూడా ఆలోచించండని కామెంట్లు పెడుతున్నారు. ఏదైతే నేమి.. ప్రస్తుతం రేవంత్ తీరు రాష్ట్రంలో విమర్శలకు దారి తీస్తుందని మాత్రం తెలుస్తోంది..

You may also like

Leave a Comment