Telugu News » Raghunandan Rao : ఆ పార్టీలకు ఓట్లు వేస్తే ప్రజలు నష్టపోక తప్పదు..!

Raghunandan Rao : ఆ పార్టీలకు ఓట్లు వేస్తే ప్రజలు నష్టపోక తప్పదు..!

రైతులు వరి సాగు చేయరాదని ఒక వేళ సాగు చేస్తే వారికి ఉరేనని బెదిరించిన వెంకట్రామిరెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. తాను దుబ్బాక ఎమ్మెల్యేగా కొనసాగిన రోజుల్లో

by Venu
Raghunandan Rao: Can't do a dual role like Revanth Reddy: Raghunandan Rao

డబ్బుల కోసం దుబ్బాక నియోజక వర్గం ప్రజలు ఓట్ల చివర్లో ఆగం కావద్దని గోస పోవద్దని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) కోరారు. నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చిన అందుబాటులో ఉంటామని తెలిపారు.. నేడు దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ రైతు సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు..

Raghunandan Rao: Elections not to get out of jail: Raghunandan Raoఅసెంబ్లీలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వాన్ని నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై నిలదీసినట్లు తెలిపిన రఘునందన్.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకొని మోసపోయి గోస పడుతున్నామని ప్రజలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మెదక్ (Medak) ఎంపీగా 10 సంవత్సరాలు ఉన్న ఆయన పార్లమెంట్ లో ప్రజల సమస్యలపై ఏనాడూ మాట్లాడలేదన్నారు.

దుబ్బాక (Dubbaka) ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ప్రజల సమస్యలను పట్టించుకోన్న పాపాన పోలేదని ఆరోపించారు. మళ్ళీ లోక్ సభ ఎన్నికల్లో ప్రజలకు డబ్బులు పంచి గెలుద్దామనే కుట్రలకు తెరతీశారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేస్తే ప్రజలు నష్టపోవడం తప్పదని సూచించారు. అబద్దాలతో కూడిని హామీలు ఇస్తూ అవసరం వెళ్ళదీసుకునే నైజం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలు నష్టపోక తప్పదని తెలిపారు..

మరోవైపు రైతులు వరి సాగు చేయరాదని ఒక వేళ సాగు చేస్తే వారికి ఉరేనని బెదిరించిన వెంకట్రామిరెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. తాను దుబ్బాక ఎమ్మెల్యేగా కొనసాగిన రోజుల్లో ప్రతి రోజు నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేశామని రఘునందన్ తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, కాంగ్రెస్ చేతిలో ప్రజలు మరోసారి మోసపోవద్దని ఓటర్లకు సూచించారు..

You may also like

Leave a Comment