Telugu News » Rahul gandhi : రాహుల్ గాంధీ లేహ్ యాత్ర.. వైరల్ పిక్స్

Rahul gandhi : రాహుల్ గాంధీ లేహ్ యాత్ర.. వైరల్ పిక్స్

ఈ పర్యటనను తొలుత రెండు రోజుల్లో ముగించాలని రాహుల్ అనుకున్నారు. కానీ, ఈనెల 25 వరకు తన పర్యటనను పొడిగించారు.

by admin
Rahul Gandhi rides bike to Ladakh's Pangong Lake to celebrate father Rajiv's birthday3

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) స్టైలిష్ లుక్ లో బైక్ నడుపుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గురువారం ఆయన బైక్ పై లేహ్ పర్యటనకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీటికి కాంగ్రెస్ (Congress) శ్రేణులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ సర్​, రేసర్​ లా ఉన్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Rahul Gandhi rides bike to Ladakh's Pangong Lake to celebrate father Rajiv's birthday

ఈ పర్యటనను తొలుత రెండు రోజుల్లో ముగించాలని రాహుల్ అనుకున్నారు. కానీ, ఈనెల 25 వరకు తన పర్యటనను పొడిగించారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత రాహుల్ గాంధీ లేహ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా 500 మంది యువకులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు రాహుల్.

Rahul Gandhi rides bike to Ladakh's Pangong Lake to celebrate father Rajiv's birthday1

లద్దాఖ్ పర్యటన విశేషాలను పంచుకున్న రాహుల్.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘ప్రపంచంలోనే అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్‌ సరస్సు ఒకటి. ఇది మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు’ అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Rahul Gandhi rides bike to Ladakh's Pangong Lake to celebrate father Rajiv's birthday2

శనివారం రాత్రి పాంగాంగ్‌ సరస్సు వద్ద ఉన్న టూరిస్ట్‌ క్యాంప్‌ లో రాహుల్​ బస చేయనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతిని ఆ సరస్సు వద్దే ఆయన చేసుకోనున్నట్లు స్పష్టం చేశాయి.

Rahul Gandhi rides bike to Ladakh's Pangong Lake to celebrate father Rajiv's birthday3

You may also like

Leave a Comment