Telugu News » ఆ మూడు పార్టీలు ఒక్కటే…బీజేపీకి ప్రతిసారీ బీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది….!

ఆ మూడు పార్టీలు ఒక్కటే…బీజేపీకి ప్రతిసారీ బీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది….!

రాజకీయాల్లో మనం ఎవరితో పోరాడుతున్నామో మనకు స్పష్టమైన అవగాహన ఉండాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

by Ramu
rahul gandhi speech in thukkuguda meeting

రాజకీయాల్లో మనం ఎవరితో పోరాడుతున్నామో మనకు స్పష్టమైన అవగాహన ఉండాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఏ శక్తులైతే మనకు వ్యతిరేకంగా నిలబడ్డాయో వాటిపై స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తోనే తలపడటం లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలతో తలపడుతోందని ఆయన తెలిపారు. ఇవన్నీ వేరు వేరు పార్టీల్లా కనిపించినా అన్ని పార్టీలు కలిసి పోయాయన్నారు.

rahul gandhi speech in thukkuguda meeting

పార్లమెంట్ లో తాను బీ ఆర్ఎస్ ఎంపీలను చూశానన్నారు. పార్లమెంట్ లో బీజేపీకి అవసరం ఉన్నప్పుడల్లా బీఆర్ఎస్ మద్దతుగా నిలిచారన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికిందన్నారు. జీఎస్టీకి కూడా మద్దతు పలికిందన్నారు. ఈ రోజు తాము మీటింగ్ పెట్టుకుంటే డిస్టర్బ్ చేసేందుకు ఆ మూడు పార్టీలు మీటింగ్ పెట్టుకున్నాయన్నారు.

కానీ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కు ఆటంకం కలిగించే పరిస్థితి లేదన్నారు. విపక్ష నేతలందిరిపై ఏదో ఒక కేసు కేంద్రం పెడుతోందన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీలు విపక్ష నేతల వెంటపడుతున్నాయన్నారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ వాళ్లు ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు. ఎంఐఎం నేతలపై కూడా ఎలాంటి కేసులు లేవన్నారు.

కేవలం ప్రతిపక్ష పార్టీలపై మాత్రమే కేసులు పెట్టారన్నారు. మోడీ తన సొంత మనుషులపై కేసులు పెట్టరని అందుకే బీఆర్ఎస్, ఎంఐఎంలపై కేసులు పెట్టలేదన్నారు. ఇక్కడి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయినా దానిపై ఎలాంటి కేసులు పెట్టరన్నారు. సోనియా గాంధీ మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారన్నారు.

ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఇచ్చిన మాటను సోనియాగాంధీ నిలబెట్టుకుంటారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తామని చెప్పారు. అన్నట్టుగానే తెలంగాణ ఇచ్చి సోనియా మాటను నిలబెట్టుకున్నారన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీ రిష్తేదార్ సమితి అని మనం పిలుస్తామన్నారు. ఇక్కడ అన్ని ఫలాలు ముఖ్యమంత్రి కుటుంబానికే చెందుతున్నాయన్నారు.

కేసీఆర్ కుటుంబం లాభం పొందేందుకు తాము తెలంగాణ ఇవ్వలేదన్నారు. పేదవాళ్లు, రైతులు, కూలీలు, మహిళల కోసం తెలంగాణను ఏర్పాటు చేశామన్నారు. తొమ్మిదేండ్లలో పేదలు, కూలీలు, యువత, మహిళలకు ఎలాంటి లాభం జరగలేదన్నారు. అతి కొద్ది నెలల్లో బీఆర్ఎస్ ను రాష్ట్రం నుంచి తరిమి కొడతామన్నారు. దాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఈ ప్రభుత్వం మారబోతుందన్నారు.

తెలంగాణ ప్రజలకు ఆరు హామీలను ఇస్తున్నామన్నారు. తాము కర్ణాటకలో ఐదు హామీలను ఇచ్చామన్నారు. వాటన్నింటినీ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం రోజే నెరవేర్చమన్నారు. తెలంగాణలో కూడా ఆరు హామీలను కెబినెట్ ప్రమాణం రోజే నెరవేరుస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయాలు లూఠీ చేసిందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా భూములను లాక్కున్నారని మండిపడ్డారు.

రైతు బంధు ద్వారా బడా బాబులకే లాభం చేకూరిందన్నారు. టీఎస్పీపీస్పీ పరీక్షా పత్రాలు లీకయ్యాయన్నారు. దేశంలో నరేంద్ర మోడీ అదానీకి లబ్ది చేకూరుస్తున్నాడన్నారు. ఏ వ్యాపారమైన, ఏ ఇండస్ట్రీయైనా అదానీకి లాభం చేకూరుస్తున్నాడన్నారు. ఇప్పుడు మోడీ వల్ల ప్రపంచంలో ధనవంతుడిగా అదానీ అయ్యారన్నారు. ఈ విషయం మాట్లాడినందుకు తనపై అనర్హత వేటు వేశారన్నారు.

తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి తాను చాలా ఉదాహరణలు ఇచ్చానన్నారు. కానీ మోడీ మాత్రం కేసీఆర్ పై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎందుకంటే మోడీకి తెలంగాణ సీఎం మద్దతు ఇస్తారన్నారు. కాంగ్రెస్ నిరుపేదలకు, రైతులకు, వెనుకుబడిన అన్ని వర్గాల కోసం కాంగ్రెస్ పని చేస్తోంది. కాంగ్రెస్ ద్వారాలు అందరికోసం తెరిచి వుంటాయన్నారు.

You may also like

Leave a Comment