రైలు(Train)లో ప్రయాణించేవారికి రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులు పాటించాల్సిన కొత్త నిబంధనలను వెల్లడించింది. IRCTC నియమాల సిరీస్‌లో కొన్ని కండీషన్లు పెట్టింది. రైలులో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వేశాఖ (Department of Railways)ఈ నిబంధనలు రూపొందించింది. ముఖ్యంగా రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికులు ఏం చేయాలో, ఏం చేయకూడదో వెల్లడించింది.
అవేంటంటే.. రాత్రి 10 గంటల తర్వాత రైలులో ఆహారం అందించబడదు. మీకు రాత్రి ఆహారం కావాలంటే మీరు దానిని పొందలేరు. మీరు ఇ-క్యాటరింగ్ సేవల సౌకర్యాన్ని పొందవచ్చ. దీని ద్వారా మీరు మీ ఆహారం లేదా స్నాక్స్‌ను రైలులో ముందస్తుగా ఆర్డర్ చేయొచ్చు. రైలులో ప్రయాణం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
టీటీఈ కూడా రాత్రి 10 గంటల తర్వాత టిక్కెట్లు చూసుకోవడానికి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. అయితే, రాత్రిపూట ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రయాణికులు తమ టిక్కెట్లను మాత్రం టీటీఈకి చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా రైలులో ప్రయాణించేవారు రాత్రి 10 గంటల తర్వాత ఒక లైట్ మినహా మిగిలిన అన్ని లైట్లు స్విచ్ ఆఫ్ చేయాలి. దీని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
ప్రయాణికుల నిద్రకు ఆటంకం కలగకుండా ఈ నిబంధనను రూపొందించారు. ఒకవేళ మీరు మీ సన్నిహితులు లేదా మిత్రులతో కలిసి ప్రయాణిస్తుంటే రాత్రి 10గంటల తర్వాత బిగ్గరగా మాట్లాడొద్దు. అలా చేస్తే రైల్వే అధికారులకు ఫిర్యాదు అందితే మీపై చర్యలు తీసుకునే అవకాశముంటుంది. అదేవిధంగా మిడిల్ బెర్త్‌లో ఉన్న ప్రయాణికుడు ఆ సమయంలో తన సీటును ఓపెన్ చేసుకోవచ్చు. కింది బెర్త్ వారు అభ్యంతరం అలా చేయొద్దంటూ అభ్యంతరం తెలపడం కుదరదు.