Telugu News » Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..!

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..!

భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ కేంద్రం తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో నవంబర్ 15న పలు చోట్ల వర్షాలు(Rain) కురిసే అవకాశం ఉందని చెప్పింది.

by Mano
rain

భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ కేంద్రం తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలో తుఫాన్ ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు(Rain) కురిసే అవకాశం ఉందని చెప్పింది.

rain

బంగాళాఖాతం ఆగ్నేయం- నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. నవంబర్ 15వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముందుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి నవంబర్ 15వ తేదీ నాటికి అల్పపీడనంగా మారనున్నట్లు వివరించింది.

దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తూర్పుమధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని అధికారులు తెలిపారు. తుఫాన్ ఆవర్తనం తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని చెప్పారు.

You may also like

Leave a Comment