Telugu News » Raja Singh : బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించే దమ్ముందా.. రాజాసింగ్..!!

Raja Singh : బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించే దమ్ముందా.. రాజాసింగ్..!!

తెలంగాణలో బీసీలను సీఎం చేస్తామని బీజేపీ హామీ ఇస్తుంటే.. కులం కంటే గుణం ముఖ్యమని ఒకరు, కుల గణన పేరుతో మరొకరు మాట్లాడుతూ బీసీ సీఎం నినాదాన్ని నీరుగార్చే కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.

by Venu
rajsingh

తెలంగాణ (Telangana)లో ముఖ్యంగా వినిపిస్తున్న మాట బీసీ (BC)లని ఎదగకుండా అణగద్రొక్కుతున్నారని.. పదవుల్లో బీసీలకి అన్యాయం జరుగుతుందని.. ఇదే కాకుండా కులాల వారీగా కూడా నిరసనలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ (BJP) తెలంగాణలో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి (CM) పదవి బీసీకి ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించింది. ఈ విషయంలో బీజేపీ శాసనసభ్యులు (Legislators) రాజాసింగ్ (Raja Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓబీసీ నేత నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీదే అని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని బీఆర్ఎస్ (BRS) ప్రకటించి మాట తప్పిందని గుర్తు చేసిన రాజాసింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్.. బీసీ ద్రోహుల పార్టీలని ఆరోపించారు.. వారి కుంటుంబాల నుంచి మాత్రమే పాలకులు రావాలనే స్వార్థంతో రెండు పార్టీలు ప్రవర్తిస్తున్నాయని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాకుండా ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.

తెలంగాణలో బీసీలను సీఎం చేస్తామని బీజేపీ హామీ ఇస్తుంటే.. కులం కంటే గుణం ముఖ్యమని ఒకరు, కుల గణన పేరుతో మరొకరు మాట్లాడుతూ బీసీ సీఎం నినాదాన్ని నీరుగార్చే కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. ఇప్పుడు 50 శాతానికిపైగా జనాభా ఉన్న ఓబీసీలంతా తమ దమ్ము చూపే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. బీసీలపట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని రాహుల్ గాంధీకి ప్రకటించే దమ్ముందా? అని ప్రశ్నించారు. బీసీల పై కట్టుకథలు చెబుతున్న కేసీఆర్, కేటీఆర్ లకు బీసీని సీఎం చేస్తామని ప్రకటించే దమ్ముందా? అని రాజాసింగ్ సవాల్ విసిరారు.

బీసీలపట్ల నిజమైన ప్రేమ, చిత్తశుద్ధి ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపిన రాజాసింగ్.. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఓబీసీ నేత నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేసిన ఘనత దక్కించుకుందని గుర్తు చేశారు. 27 మంది ఓబీసీలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాకుండా.. దళిత, గిరిజన, మైనారిటీ నేతలను రాష్ట్రపతి చేసిన చరిత్ర బీజేపీది అని వెల్లడించారు. బీజేపీని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ కు లేదని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలంతా నిజానిజాలు గుర్తించి తగిన తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు రాజాసింగ్ తెలిపారు.

You may also like

Leave a Comment