Telugu News » Rajnath Singh: భారత్ ఎవరినీ శత్రువుగా భావించడం లేదు: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

Rajnath Singh: భారత్ ఎవరినీ శత్రువుగా భావించడం లేదు: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ బ్రిటన్‌ పర్యటనలో భాగంగా బుధవారం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌(Britain PM Rishi sunak) , విదేశాంగ మంత్రి డేవిడ్‌ కామెరూన్‌ను కలిశారు. ఈ భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలు, రక్షణ, వాణిజ్యం, ప్రాంతీయ అంశాలపై చర్చించారు.

by Mano
Rajnath Singh: India does not consider anyone as enemy: Union Minister Rajnath Singh

భారత్‌ ఎవరినీ శత్రువుగా భావించడం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి(Defense Minister) రాజ్‌నాథ్‌సింగ్(Rajnath Singh) అన్నారు. ఆయన బ్రిటన్‌ పర్యటనలో భాగంగా బుధవారం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌(Britain PM Rishi sunak) , విదేశాంగ మంత్రి డేవిడ్‌ కామెరూన్‌ను కలిశారు. ఈ భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలు, రక్షణ, వాణిజ్యం, ప్రాంతీయ అంశాలపై చర్చించారు.

Rajnath Singh: India does not consider anyone as enemy: Union Minister Rajnath Singh

దీంతోపాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్ఏ)కు సంబంధించి కొనసాగుతున్న చర్చల పురోగతిపై కూడా మాట్లాడుకున్నారు. అదేవిధంగా బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్‌తో భారత్-యుకే సంబంధాలను పెంపొందించడం, ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేయడంపై ఆచరణాత్మక చర్చలు జరిగాయని రాజ్‌నాథ్‌ సింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

రెండు అత్యున్నత స్థాయి సమావేశాల తర్వాత, రాజ్‌నాథ్‌సింగ్ తన కౌంటర్ గ్రాంట్ షాప్‌తో కలిసి యూకే- ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ సీఈవోల రౌండ్‌టేబుల్ సమావేశానికి సహ- అధ్యక్షుడిగా వ్యవహరించారు. యూకే రక్షణ పరిశ్రమకు చెందిన పలువురు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, యూకే రక్షణ మంత్రిత్వ శాఖ, యూకే-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు హాజరయ్యారు.

రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. భారత్‌తో పాటు మరే దేశంలోనూ డిజిటల్ లావాదేవీల్లో 80కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు లేరని అన్నారు. ప్రపంచం మొత్తం మా యూపీఐ యాప్‌ను ఆమోదించిందని, యూపీఐ ద్వారా దాదాపు 130 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. చైనా మౌత్ పీస్ అయిన గ్లోబల్ టైమ్స్ రచయిత రాసిన కథనంలో భారత్ పట్ల చైనా వైఖరిలో భారీ మార్పు వచ్చిందన్నారు.

భారత్‌లో ఆర్థిక, వ్యూహాత్మక మార్పుల కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ వ్యూహాత్మక శక్తిగా మారిందని చైనా ప్రభుత్వం కూడా విశ్వసిస్తోందని తెలిపారు. భారత్, చైనా మధ్య సంబంధాలు బాగా లేవని అభిప్రాయపడ్డారు. ఈ విషయం ప్రపంచానికి తెలుసని తెలిపారు. తాము అందరితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

You may also like

Leave a Comment